వీరంతా ‘వీగన్‌’ స్టార్స్‌

జంతు సంబంధిత ఆహారం, ఉత్పత్తులకు దూరంగా ఉండే వారిని వీగన్స్‌ అంటారు. మొక్కలకు సంబంధించిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. భారత్‌లో కొంతమంది సెలబ్రిటీలు వీగన్‌ లైఫ్‌స్టైల్‌ను పాటిస్తున్నారు. 

సోనాక్షీ సిన్హా

బరువు తగ్గడంలో వీగన్‌ లైఫ్‌స్టైల్‌ ఎంతగానో ఉపయోగపడిందని సోనాక్షీ చెప్పింది. జంతువులపై సోనాక్షికున్న ప్రేమ కూడా వీగన్‌గా మారడానికి కారణం.

విరాట్‌ కోహ్లీ

టీమ్‌ ఇండియా కింగ్ విరాట్‌ కోహ్లీ కూడా వీగనే. 2016 ఐపీఎల్‌ తర్వాత తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపర్చుకునే క్రమంలో వీగన్‌గా మారాడు.

సోనమ్‌ కపూర్‌

కొన్ని ఏళ్ల కిందటే సోనమ్‌ వీగన్‌గా మారింది. ఆహారం కోసం జంతువుల్ని చంపడం తనను ఎంతగానో బాధించింది. దీంతో వీగన్‌ లైఫ్‌స్టైల్‌ను ఎంచుకుంది.

ఆమిర్‌ ఖాన్‌

ఆమిర్‌ 2015 నుంచి వీగన్‌ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తున్నారు. జంతు ఉత్పత్తులను తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వీడియోలను తన మాజీ భార్య కిరణ్‌ రావు చూపించింది. దీంతో వీగన్‌గా మారిపోయాడు. 

షాహిద్‌ కపూర్‌

తన తండ్రి ఇచ్చిన ఓ పుస్తకం చదివిన తర్వాత జిహ్వా రుచి కోసం జంతువుల్ని చంపడం సబబు కాదనిపించిందట షాహిద్‌కి. దీంతో శాకాహారిగా మారిపోయాడు. పూర్తిగా వీగన్‌ కాకపోయినా.. ఆ లైఫ్‌స్టైల్‌ను పాటించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

శ్రద్ధా కపూర్‌

‘సాహో’ బ్యూటీ శ్రద్ధా 2019 నుంచి వీగన్‌గా మారింది. జంతువులపై తనకున్న ప్రేమే వీగన్‌గా మార్చింది. 2022లో శ్రద్ధాను పెటా ‘ది హాటెస్ట్‌ వెజిటేరియన్‌’గా పేర్కొంది. 

జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌

జంతువులపై తనకున్న ప్రేమతోపాటు.. ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి వీలుగా వీగన్‌ లైఫ్‌స్టైల్‌ను ఎంచుకున్నట్లు జాక్వెలై తెలిపింది. 

రిచా చద్దా

జంతువుల పెంపకం కోసం అడవుల్ని నరికేస్తున్నారని వివిధ పరిశోధనల ద్వారా తెలుసుకున్న రిచా వీగన్‌గా మారిపోయింది. 

కంగనా రనౌత్‌

మొదట్లో కంగనా కేవలం వెజిటేరియన్‌గానే ఉండేది. పాలు, పాల ఉత్పత్తుల వల్ల ఎసిడిటీ వస్తుండటంతో పూర్తిగా వీగన్‌ లైఫ్‌స్టైల్‌లోకి వచ్చేసింది.  

జెనీలియా

వీగన్‌గా మారడానికి తన కుమారుడే కారణమని చెప్పింది జెనీలియా. ‘శునకాన్ని ఇష్టంగా పెంచుకుంటున్నాం.. కోడిని తింటున్నాం. రెండు జంతువులే కదా? తేడా ఏంటి?’ అని తనయుడు అడిగాడట. అప్పట్నుంచి వీగన్‌గా మారిపోయింది. జెన్ని భర్త రితేశ్‌ కూడా వీగనే. 

మలైకా అరోరా

ప్రయోగాత్మకంగా అనుసరించిన వీగన్‌ డైట్‌ ఫిట్‌నెస్‌కు ఎంతో ఉపయోగపడటంతో మలైకా అరోరా కూడా వీగన్‌గా మారిపోయింది. 

ఈషా గుప్తా

పాలు తాగడం వల్ల ఈషాకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయట. అలాగే ఆహారపు అలవాట్లు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపే డాక్యుమెంటరీని చూశాక పూర్తిగా వీగన్‌గా మారిపోయింది. 

మల్లికా శెరావత్ 

మల్లికా చిన్నప్పట్నుంచీ శాకాహారే. 18 ఏళ్ల కిందట వీగన్‌గా మారింది. మారిన తర్వాత తనకు ఎంతో ఉత్సాహాంగా ఉంటోందని, మంచిగా నిద్ర పడుతోందని తెలిపింది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home