విమల.. అందం అస్సలు తగ్గలా!
విమలా రామన్.. అప్పుడెప్పుడో పుష్కరకాలం కిందట ‘ఎవరైనా ఎప్పుడైనా’తో టాలీవుడ్‌లో మెరిసింది. 2017లో నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’లో పద్మావతిగా కనిపించింది.
Image: Instagram/Vimala Raman
మళ్లీ ఇన్నాళ్లకు ‘రుద్రంగి’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. జగపతిబాబు ప్రధాన పాత్రలో.. నిజాం నాటి కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. జులై 7న విడుదలకానుంది.
Image: Instagram/Vimala Raman
తాజాగా విడుదలైన చిత్రం ట్రైలర్ చూస్తే.. విమలా రామన్ దొరసాని మీరాబాయి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
Image: Instagram/Vimala Raman
తెలుగింటి అమ్మాయిలా కనిపించే ఈ భామ.. ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగింది. బీఎస్సీ చదువుకుంది.
Image: Instagram/Vimala Raman
విమలారామన్ మంచి డ్యాన్సర్. ఆస్ట్రేలియాలోనే భరతనాట్యంలో శిక్షణ పొందింది.
Image: Instagram/Vimala Raman
పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఈ భామ.. 2004లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా టైటిల్ గెలుచుకుంది.
Image: Instagram/Vimala Raman
అలా.. భారతీయ దర్శకుల దృష్టిలో పడ్డ విమల.. తొలిసారిగా 2006లో ‘పోయి’ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అదే ఏడాది ఒడియాలో ‘బాజీకర్’లో నటించింది.
Image: Instagram/Vimala Raman
తెలుగులో ‘ఎవరైనా ఎప్పుడైనా’, ‘గాయం 2’, ‘రంగా ది దొంగ’, ‘రాజ్’, ‘చట్టం’ తదితర చిత్రాలు చేసింది. హిందీలోనూ ‘ముంబయి మిర్రర్’లో మెరిసింది.
Image: Instagram/Vimala Raman
తన అందంతో ఆకట్టుకుంటూ తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేసింది. 2013 వరకు సాగిన ఈ భామ జోరు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది.
Image: Instagram/Vimala Raman
ఆడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 2021లో ‘పబ్ గోవా’ అనే వెబ్‌సిరీస్‌లో నటించిన విమల.. 2022లో ‘గ్రాండ్‌మా’ అనే తమిళ చిత్రంలో నటించింది.
Image: Instagram/Vimala Raman
ఇప్పుడు ‘రుద్రంగి’తో మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమైంది.
Image: Instagram/Vimala Raman
ఈ సీనియర్ హీరోయిన్ అందం.. ఇప్పటికీ తగ్గలేదు. సోషల్‌మీడియాలో ఈమె పెట్టే గ్లామర్ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Image: Instagram/Vimala Raman