‘మెగా’ బ్లాస్ట్‌.. వరీనా హుస్సేన్‌!

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ ఆ మధ్య విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అందులోని స్పెషల్‌ సాంగ్‌ అయితే.. అందరినీ ఆకట్టుకుంది. కారణం.. వరీనా హుస్సేన్‌.

Image: Instagram/warinahussain

థమన్‌ అందించిన ‘బేబీ బ్లాస్ట్‌’ పాటలో వరీనా ఆడిపాడింది. తన డ్యాన్స్‌తో, లుక్స్‌తో కట్టిపడేసింది. కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’లోనూ మెరిసిందీ బ్యూటీ.

Image: Instagram/warinahussain

ఇది వరకు బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన వరీనా.. ఇక్కడి అమ్మాయి కాదు.

Image: Instagram/warinahussain

తను అఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్‌లో 1999 ఫిబ్రవరి 23న జన్మించింది. పెరిగింది మాత్రం.. అమెరికాలో.

Image: Instagram/warinahussain

యూఎస్‌లోనే చదువుపూర్తి చేసుకుంది. నటనపై ఆసక్తితో న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంది.

Image: Instagram/warinahussain

తన తల్లితో కలిసి 2013లో భారత్‌కు చేరుకున్న ఈ భామ.. మోడలింగ్‌ చేస్తూ పలు బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లో నటించింది.

Image: Instagram/warinahussain

ఈ క్రమంలోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నిర్మించిన ‘లవ్‌రాత్రి’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది.

Image: Instagram/warinahussain

తన సినిమాకి హీరోయిన్‌ దొరికిందంటూ సల్మాన్‌ చేసిన ట్వీట్‌తో వరీనా.. ఒక్కసారిగా పాపులర్‌ అయింది. ఆమె వివరాల కోసం నెటిజన్లు తెగ అన్వేషించారు.

Image: Instagram/warinahussain

ఆ సినిమా తర్వాత ర్యాప్‌ సింగర్‌ బాద్‌షా రూపొందించిన పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో, ‘99 సాంగ్స్‌’లో నటించింది. దబాంగ్‌ 3లోని ప్రత్యేక పాటలోనూ తళుక్కుమంది.

Image: Instagram/warinahussain

వరీనా అభిమాన నటుడు సల్మాన్‌ఖాన్‌. అభిమాన సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌.

Image: Instagram/warinahussain

ట్రావెలింగ్‌ చేయడం, డ్యాన్స్‌ చేయడం, పుస్తకాలు చదవడం తన హాబీస్‌.

Image: Instagram/warinahussain

మొబైల్‌ అతి వినియోగం వల్ల కలిగే అనార్థాలపై వారిన.. తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుంటుంది. అందరూ మొబైల్‌లో మునిగిపోయి వాస్తవిక జీవితాన్ని కోల్పోతున్నారని అంటోంది.

Image: Instagram/warinahussain

మొబైల్‌ని తను చాలా తక్కువగా వినియోగిస్తుందట. ‘విహారయాత్రకు వెళితే.. అందరూ సెల్ఫీలు దిగుతుంటారు.. ప్రతిదీ ఫొటోలు తీస్తుంటారు. కానీ, నేను మాత్రం మొబైల్‌ను పక్కన పెట్టేస్తాను’అని చెప్పుకొచ్చింది.

Image: Instagram/warinahussain

వరీనా హుస్సేన్‌ ఇన్‌స్టా ఖాతాను 2 మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

Image: Instagram/warinahussain

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

చందనాల బుట్టబొమ్మ

డ్యాన్స్ హాబీ... రీల్స్‌ సరదా!

Eenadu.net Home