అన్నం పరబ్రహ్మ స్వరూపం..

కష్టపడి పనిచేసేది కడుపు నిండా భోజనం కోసమే. కానీ ఎంతో మందికి తినడానికి తిండి లేక.. అలమటిస్తున్నారు. అక్టోబరు 16న ప్రపంచ ఆహార దినోత్సవం.. దాని విశేషాలేంటో చూద్దామా..

ప్రపంచవ్యాప్తంగా ఆకలిచావులు 1945 కు పూర్వం ఎక్కువగా ఉండేవి. వీటిని నివారించడానికి ఆహార దినోత్సవాన్ని ఏటా అక్టోబరు 16న నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 

ఏటా ఈ రోజున ఆహార వృథాపై అవగాహన కల్పిస్తారు. ఆకలితో అలమటిస్తున్న వారికి సాయం చేసేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపు 150 దేశాలు ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

‘వాటర్‌ ఈజ్‌ లైఫ్. వాటర్‌ ఈజ్‌ ఫుడ్. లీవ్ నో వన్‌ బిహైండ్‌’ అనే థీమ్‌తో నీరు ఎక్కువగా ఉంటేనే పంటలు సుభిక్షంగా పండి ఆహారం దొరుకుతుందని వివరిస్తూ ఈ ఏడాది వరల్డ్‌ ఫుడ్‌ డేని సెలబ్రేట్‌ చేస్తున్నారు.

పిల్లలకు లంచ్‌ బాక్సు పెడితే కొంచెమైనా వదిలేస్తుంటారు. కానీ జపాన్‌ లో అలా చేయరట. వారికి ‘షోకుయికు’ అని ప్రత్యేక తరగతి నిర్వహిస్తారు. ఆహార ప్రాధాన్యాన్ని ఈ క్లాస్‌లో వివరిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా తగినంత ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ, ప్రతి తొమ్మిది మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు. వారిలో 60 శాతం మహిళలే ఉన్నారు.

దాదాపు 45 శాతం శిశు మరణాలు పోషకాహార లోపంతో ముడిపడి ఉన్నాయి. పిల్లలకు పోషకాహారం కోసం ఏటా 3.5 ట్రిలియన్లు ఖర్చు చేసినా ఫలితం ఉండటం లేదని నివేదికలు చెబుతున్నాయి.

మహాత్మాగాంధీ

ప్రతి మనిషికి గాలి నీరు ఎంత అవసరమో అలాగే శరీరానికి శక్తి కావాలంటే ఆహారం ఎంతో ముఖ్యమనేవారు మహాత్మాగాంధీ. కాలానికి తగిన పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు ఎక్కువగా తినేవారు. తృణ ధాన్యాలు, ఆవు, మేకపాలు తీసుకునేవారు.

 

నరేంద్ర మోదీ

మల్టీ గ్రెయిన్‌ బ్రెడ్‌, ఉడికించిన బీన్స్‌, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. కాలానుగుణంగా దొరికే పుట్టగొడుగులు, కాటేజ్‌ చీజ్‌ అంటే మోదీకి చాలా ఇష్టం అంటున్నారు.

అమితాబ్‌ బచ్చన్‌

బెంగాలీ స్వీట్లు అంటే అమితాబ్‌కి మహా ప్రీతి. వ్యాయామం చేసేవారికి ఆహారంలో అధిక పోషకాలు ఉండాలి. తులసి ఆకులు, ఉసిరి రసం, కొబ్బరి నీళ్లు, పప్పులు కూరగాయలు తీసుకుంటానంటారు అమితాబ్‌.

జవహర్‌లాల్‌ నెహ్రూ

దేశ మొదటి ప్రధాని నెహ్రూ తన ఆహారంలో మొదటి ప్రాధాన్యం తందూరి చికెన్‌కే ఇస్తారు. ఏం తిన్నా అతిగా తినడం వల్ల ఇబ్బందులే ఎదురవుతాయి. కాబట్టి ఎంత కావాలో అంతే తీసుకుంటే మేలనేవారు నెహ్రూ.  

ఈ నైపుణ్యాలు మీ సొంతమైతే.. కెరీర్‌లో తిరుగుండదు!

పాములే లేని దేశాల గురించి విన్నారా..!

పిల్లలకు ఇవి నేర్పుతున్నారా..!

Eenadu.net Home