wpl అందాల యాంకర్‌.. గురించి తెలుసా?

wpl యాంకర్‌గా వ్యవహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ భామ పేరు తెలుసా..? అర్చనా విజయ పూరి. గుక్క తిప్పుకోకుండా గడగడా మాట్లాడేస్తుంది!

అర్చన కోల్‌కతాలో రాజస్థానీ కుటుంబంలో జన్మించింది. యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో డిగ్రీ పూర్తి చేసింది. 

2004లో ‘గెట్‌ గార్జియస్‌’ అనే అందాల పోటీలో పాల్గొని టైటిల్‌ గెలిచింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది.

This browser does not support the video element.

టీవి షోలు, ఫుడ్‌, ట్రావెలింగ్‌కి సంబంధించిన వీడియోలు చేసింది. ఆ తర్వాత.. ఐపీఎల్ సీజన్‌ 4కి యాంకరింగ్‌ చేసేందుకు అవకాశం వచ్చింది. 

ఈమె యాంకర్‌ మాత్రమే కాదు.. డ్యాన్సర్‌ కూడా..! ‘ఝలక్‌దిఖ్లాజా’ షోలోనూ పాల్గొంది.

దిల్లీకి చెందిన వ్యాపారవేత్త ధీరజ్‌ పూరిని ప్రేమించి పెళ్లాడింది. ఇటీవల ఈమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఐపీఎల్‌లో ప్రస్తుతం ఉన్న ఎనిమిది మంది యాంకర్లకు దీటుగా అర్చన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

క్రికెట్‌ అభిమానుల్లో చాలా మంది ఈమెకి ఫ్యాన్స్‌. తన ఇన్‌స్టా ఖాతాకి దాదాపు 5లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

This browser does not support the video element.

ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది. కఠినమైన డైట్‌ ఫాలో అవుతుంది. ఎక్కువ సమయం జిమ్‌కే కేటాయిస్తుంది.

అర్చనకి ఫొటోషూట్లంటే మహా ఇష్టం. చీరలు, మోడ్రన్‌ డ్రెస్సులతో ఫొటోలు తీసుకొని సోషల్‌ మీడియాలో షేర్ చేస్తుంది.

This browser does not support the video element.

స్విమ్మింగ్‌ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తుంది. అదే తన హాబీ కూడా. 

ఆఖరి ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు వీరివే!

పవర్‌ప్లేలో పవర్‌ఫుల్ హైదరాబాద్‌

నాలుగు పదుల వయసులోనూ తగ్గేదేలే..!

Eenadu.net Home