తొమ్మిదో ఏటే అండర్‌-15కు ఎంపికై..

డబ్ల్యూపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు నాయకురాలు స్మృతి మందన. ఉత్తమ క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె గురించి ఆసక్తికర విషయాలు.

స్మృతి ముంబయిలోని మార్వాడీ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పట్నుంచే ఆటలపై మక్కువ చూపేది.

మహారాష్ట్ర తరఫున అండర్‌ 16 టోర్నమెంట్‌లో తన సోదరుడు శ్రవణ్‌ ఆడటం చూసిన తర్వాత క్రికెట్‌పై అభిమానం పెంచుకుంది.

తొమ్మిదేళ్ల వయసులో అండర్‌ 15కి ఎంపికైంది. పదకొండో ఏట అండర్‌-19కి ఆడింది. ఇలా క్రికెట్‌పై మక్కువతో రోజులో ఎక్కువ గంటలు ఆడుతూనే ఉండేదట.

కుటుంబం మొత్తం ఆమెకు సహకరించేవారు. తండ్రి ఆటకు సంబంధించిన షెడ్యూల్, తల్లి ఆహారం, దుస్తులపై దృష్టి పెట్టేదట.

This browser does not support the video element.

సోదరుడు ఇప్పటికీ నెట్స్‌లో స్మృతి ప్రాక్టీసుకి సాయం చేస్తాడని ఆమె ఇంటర్వ్యూలో తెలిపింది.

కుటుంబంతో కలసి పండుగలు చేసుకుంటే... ఆ ఆనందం రెట్టింపు అవుతుంది అని చెబుతోంది స్మృతి.

‘కోపం, సంతోషం, బాధ ఇలా ఏ ఎమోషన్‌లో ఉన్నా ఫుడ్‌తోనే దానికి సమాధానం చెప్తాను. ఇష్టమైన వంటకాలన్నీ బాగా లాగించేస్తాను’ అని చెబుతోంది.

రేసింగ్‌ అంటే ఎంతో ఇష్టం. షెడ్యూల్‌ ఫ్రీగా ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి ట్రిప్‌లు ప్లాన్‌ చేస్తుంది.

IPL వేలం: వీళ్లకు ఊహించిన ధర కంటే ఎక్కువే!

IPL వేలం: ఈ ఏడాది టాపర్‌ పంత్‌.. మరి గతంలో?

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

Eenadu.net Home