కెనడా GT20లో పంజాబీ బ్యూటీ!

తాజాగా కెనడాలో GT20 క్రికెట్‌ లీగ్‌ జరిగింది. మ్యాచ్‌లు ఏమో గానీ.. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా వ్యవహరించిన యెశ సాగర్‌.. అందరినీ ఆకట్టుకుంటోంది. 

(Photos: Instagram/𝗬𝗘𝗦𝗛𝗔 SAGAR)

భారత్‌కు చెందిన ఈమె.. కెనడాలోని టొరంటోలో స్థిరపడింది. పలు పంజాబీ మ్యూజిక్‌ వీడియోల్లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది.

ఆ పాపులారిటీతోనే GT20లో యాంకర్‌గా మారి క్రికెటర్లను ఇంటర్వ్యూ చేసి.. క్రికెట్‌ ముచ్చట్లు చెప్పి యూత్‌ను ఆకర్షించింది. దీంతో ఈమె ఎవరా అని.. గూగుల్‌లో అన్వేషిస్తున్నారు. 

పంజాబ్‌లోని లూధియానాలో 1996లో జన్మించిన యెశ.. కెనడాలోని సెనికా కాలేజ్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. 

చదువు పూర్తి కాగానే 2017లో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. స్నేహితుల సూచన మేరకు ఓ మ్యూజిక్‌ వీడియోలో నటించగా.. ఈమె ప్రతిభకు అవకాశాలు క్యూ కట్టాయి. అలా పంజాబీ మ్యూజిక్‌ వీడియోల్లో మెరిసింది. 

ప్రముఖ పంజాబీ గాయకులు పర్మేశ్‌ వర్మ, గుర్‌ సిద్ధు, హర్ష్‌ బెనిపాల్‌, గిప్పీ గ్రెవాల్‌, ప్రేమ్‌ దిల్లాన్‌తో వీడియోల్లో ఆడిపాడింది. 

ఈమె చేసిన 20కిపైగా మ్యూజిక్‌ వీడియోల్లో ‘చిరీ ఉడ్‌ కా ఉడ్‌’ పాటకి 50 మిలియన్‌కిపైగా వ్యూస్‌ వచ్చాయి. 2021లో చివరగా ‘లాస్ట్‌ లవ్‌’లో నటించింది.

యెశ నటించిన పంజాబీ చిత్రం ‘యారన్‌ ద రుత్బా’ గత ఏప్రిల్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. 

సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ.. ఇన్‌స్టాలో తన గ్లామరస్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటుంది. దీంతో ఈమెకు ఫాలోయింగ్‌ పెరుగుతోంది. 

This browser does not support the video element.

యెశ.. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. ఆ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌కు ఫిట్‌నెస్‌ సూచనలిస్తుంటుంది. 

ఈ బ్యూటీకి పుస్తకాలు చదవడం హాబీ. తను చదివిన పుస్తకాలకు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. 

IPL సెంచరీలు.. భారత బ్యాటర్లు వీరే!

చాహల్ @ 200.. తర్వాత ఎవరంటే?

ఐపీఎల్‌.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్లు ఇవే

Eenadu.net Home