యుక్తి తరేజా.. తెలుగు తెరపై కొత్తందం!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య కొత్త సినిమాలో నటిస్తోంది.. బాలీవుడ్‌ బ్యూటీ యుక్తి తరేజా.

Image: Instagram/Yukti Thareja

గతేడాది యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన ‘లుట్‌ గయే’ పాట గుర్తుందా.. అందులో ఇమ్రాన్‌ హష్మీతో కలిసి నటించింది యుక్తి తరేజా.

Image: Instagram/Yukti Thareja

ఇప్పుడు టాలీవుడ్‌ చిత్రంలో ఛాన్స్‌ దక్కించుకుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. కల్యాణ్‌రామ్‌ చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం.

Image: Instagram/Yukti Thareja

హరియాణాలోని ఖైతల్‌లో జన్మించిన యుక్తి... మోడలింగ్‌పై ఆసక్తితో ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ ముంబయికి వచ్చేసింది.

Image: Instagram/Yukti Thareja

మోడలింగ్‌ చేస్తూనే 2019లో ‘ఎంటీవీ సూపర్‌మోడల్‌ ఆఫ్ ది ఇయర్‌’ పోటీల్లో పాల్గొంది.

Image: Instagram/Yukti Thareja

2021లో ‘లుట్‌ గయే’ పాట బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో యుక్తికి పాపులారిటీ పెరిగింది.

Image: Instagram/Yukti Thareja

ఆమె అభిమాన నటి అనుష్క శర్మ. ఇక రణ్‌వీర్‌ సింగ్‌ అంటే చాలా ఇష్టమట.

Image: Instagram/Yukti Thareja

ప్రియాంక చోప్రా నుంచి ధైర్యంగా ఉండటం, షారుఖ్‌ ఖాన్‌ నుంచి నటన నేర్చుకోవాలని అంటోంది.

Image: Instagram/Yukti Thareja

సస్పెన్స్‌ డ్రామా జోనర్‌ చిత్రాలంటే యుక్తికి చాలా ఇష్టమట. అలాంటి సినిమాలో నటించాలని అనుకుంటోంది కూడా.

Image: Instagram/Yukti Thareja

యుక్తి.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌. తరచూ గ్లామరస్‌ ఫొటోలు పోస్టు చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Yukti Thareja

తన అందానికే కాదు.. తన ట్రెండీ లుక్స్‌కి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Image: Instagram/Yukti Thareja

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

Eenadu.net Home