బ్రో.. యువలక్ష్మి నటనకు యూత్‌ ఫిదా!

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కలిసి నటించిన ‘బ్రో’ ఇటీవల విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియత్‌తోపాటు మరో అమ్మాయి కూడా ఆకట్టుకుంది. తనే తమిళ నటి యువలక్ష్మి.

(Photos: Instagram/Yuvalakshmi)

‘బ్రో’లో సాయిధరమ్‌ తేజ్‌కి మొదటి చెల్లెలుగా ప్రియ ప్రకాశ్‌ నటించగా.. రెండో చెల్లెలుగా యువలక్ష్మి నటించింది.

ఈ సినిమాకి మాతృక అయిన ‘వినోదాయ సిత్తం’లోనూ ప్రధాన పాత్రకు రెండో కుమార్తె ‘గాయత్రి’గా నటించింది. తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రనే పోషించింది. కాకపోతే హీరోకి చెల్లెలుగా..

యువ నటి అసలు పేరు.. యువశ్రీ లక్ష్మి. పుదుచ్చేరిలోని కారైకాల్‌లో డిసెంబర్‌ 25, 2000న జన్మించింది. 

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి.. నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016లో ‘అమ్మ కనక్కు’లో అమలా పాల్‌ కుమార్తెగా నటించి.. తెరంగేట్రం చేసింది. ఇందులో సముద్రఖని కూడా నటించారు. 

ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వం వహించిన ‘అప్పా’, శివకార్తికేయన్‌ ‘వెలైకరన్‌’, ‘అరుతుర’, ‘కాంచనా 3’లో సహాయక పాత్రలు పోషించింది.

‘అప్పా’ చిత్రాన్నే మలయాళంలో ‘ఆకాశమిట్టయే’గా రీమేక్‌ చేశారు. ఈ చిత్రంతో యువలక్ష్మి మాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సముద్రఖని కో-డైరెక్టర్‌గా పనిచేశారు.  

సముద్రఖని దర్శకత్వం వహిస్తూ నటించిన ‘వినోదాయ సిత్తం’, తెలుగు రీమేక్‌ ‘బ్రో’లోనూ ఈ బ్యూటీ నటించి మెప్పించింది. 

ఈ యువతారకి భరతనాట్యమంటే చాలా ఇష్టం. శిక్షణ తీసుకోవడమే కాదు.. పలు ప్రదర్శనలిచ్చి.. జాతీయ అవార్డుతోపాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకుంది.

బ్రో.. గాయత్రి మంచి నటి మాత్రమే కాదు, గాయని కూడా. చక్కగా పాటలు పాడుతుందట. ఇక ఈమెకు శరత్‌కుమార్‌ నటించిన ‘సూర్యవంశం’ బాగా నచ్చిందట. హీరోల్లో జాకీచాన్‌కీ పెద్ద ఫ్యాన్‌. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home