తెలుగువారి ఠీవి.. పీవీ

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీవీ గురించి కొన్ని విషయాలు.. అరుదైన ఫొటోలు..

పీవీ నరసింహారావు పూర్తి పేరు.. పాములపర్తి వెంకట నరసింహారావు. 1921 జూన్‌ 28న వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చదివారు. ఆ తర్వాత నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 

1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన పీవీ.. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.

1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా ఉన్న ఆయన.. ఆ పదవి చేపట్టిన తొలి దక్షిణాది, ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు.

1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 5లక్షల మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. 

సంగీతం, సినిమా, నాటకాలంటే అమితాసక్తి. భార‌తీయ ఫిలాస‌ఫీ, సంస్కృతి, ర‌చ‌న, రాజ‌కీయ వ్యాఖ్యానం, భాష‌లు నేర్చుకోవ‌డం, తెలుగు, హిందీలో క‌విత‌లు రాయ‌డం, సాహిత్యాల‌పై ప్రత్యేక ఆసక్తి.

పీవీ 14 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయవ్యవస్థ కన్నా దేశం గొప్పదని విశ్వసించే దేశభక్తుడైన రాజకీయవేత్త పీవీ అని మాజీ రాష్ట్రపతి, ‘భారతరత్న’ అబ్దుల్‌ కలాం ఆయన్ను అభివర్ణించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(26-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చెప్పిన సూక్తులు (శతజయంతి)

Eenadu.net Home