విజయ్‌ ‘లియో’ విశేషాలు..!

విజయ్ హీరోగా లోకేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘లియో’. త్రిష కథానాయిక. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా. అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘లియో’కు సంబంధించిన పలు విశేషాలు..!

2021లో విడుదలైన ‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌ - లోకేశ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిదే. ‘మాస్టర్‌’ షూట్‌లోనే వీరిద్దరి మధ్య ‘లియో’ గురించి చర్చలు జరిగాయి. 

‘లియో’ కథ అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో షూట్‌ చేయాలని చిత్రబృందం భావించింది. ఇక్కడి రోడ్లపై చిత్రీకరణ చేస్తే విజయ్‌ అభిమానులను కంట్రోల్‌ చేయడం సాధ్యం కాదని భావించి కశ్మీర్‌లో షూట్‌ చేశారు.

‘ఆంటోనీ’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా పట్టాలెక్కింది. పలు చర్చల తర్వాత ‘లియో’ టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. ఆంటోనీ పేరు బాగా నచ్చడంతో సంజయ్‌ దత్‌ పాత్రకు ఆ పేరు పెట్టారు.

‘లియో’లో విజయ్‌పై ఓ మేజర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. గోదాంలో షూట్‌ చేసిన ఈ సీన్‌లో దాదాపు 150 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. 20 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ తర్వాత లోకేశ్‌ సినిమా అనగానే ప్రేక్షకులు బిర్యానీ సీక్వెన్స్‌ చూడాలనుకుంటారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలోనూ బిర్యానీ సీన్‌ క్రియేట్‌ చేశారు.

విజయ్‌ - త్రిషపై చిత్రీకరించిన ఓ ఎమోషనల్‌ సీన్‌ను ఎలాంటి కట్‌ లేకుండా ఆరు నిమిషాలపాటు చిత్రీకరించారు. భావోద్వేగంగా సాగే ఈ సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు విజయ్‌ యాక్టింగ్‌ చూసి లోకేశ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సినిమా జనవరిలో మొదలైనప్పటికీ గతేడాది అక్టోబర్‌ నుంచే గ్రాఫిక్స్‌పై చిత్రబృందం ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది. హైనా ఫైట్‌, కారు ఛేజింగ్‌ సీక్వెన్స్‌లకు టెక్నికల్‌గా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.

కాలేజీ చదువుతున్న రోజుల్లో తన సీనియర్‌ దాస్‌ అంటే లోకేశ్‌కు ఎంతో ఇష్టం. అతని పేరును ప్రేరణగా తీసుకునే తన చిత్రాల్లో కీలకపాత్రల పేరు చివరన దాస్‌ అని పెట్టారు.

త్రిషకు చిన్మయి గతంలో వాయిస్‌ ఓవర్‌ చెప్పిన పాత్రలు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలోనూ చిన్మయితోనే డబ్బింగ్‌ చెప్పించారు. దాదాపు నాలుగేళ్ల బ్యాన్‌ తర్వాత కోలీవుడ్‌లో చిన్మయి డబ్బింగ్‌ చెప్పిన చిత్రమిదే.

‘లియో’ సినిమా పూర్తి నిడివి 2 గంటల 43 నిమిషాలు. రన్‌టైమ్‌ను దృష్టిలో ఉంచుకునే ట్రైలర్‌ను సైతం 2 నిమిషాల 43 సెకన్లకు కట్‌ చేశారు.

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

Eenadu.net Home