700 మంది ఏడు నెలలు.. 300లకు పైగా కాస్ట్యూమ్స్‌

‘హీరామండి’ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తీసిన తొలి ఓటీటీ సిరీస్‌. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

స్వాతంత్ర్యానికి ముందు ఇప్పటి పాకిస్థాన్‌ లాహోర్‌లో వ్యభిచారులు నివశించే ప్రాంతాన్ని హీరామండిగా పిలిచేవారు.

భారత స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కాస్త ఫిక్షన్‌ జోడించి భన్సాలీ తీసిన వెబ్‌సిరీస్‌ ఇది.

అప్పటి హీరామండిని రీక్రియేట్‌ చేసేందుకు దాదాపు 700 మంది ఏడు నెలల పాటు పనిచేశారు. భన్సాలీ తీసిన వాటిల్లో ఇదే అతి పెద్ద సెట్‌ కావడం విశేషం.

ఈ నెట్‌ఫ్లిక్స్‌ షో కోసం డిజైనర్లు రింపుల్‌, హర్‌ప్రీత్‌లు రెండేళ్ల పాటు పనిచేసి, 300లకు పైగా కాస్ట్యూమ్స్‌ను రూపొందించారు.

ఈ సిరీస్‌ పూర్తికావడానికి 380రోజులు పట్టింది. నటీనటులు తమ పాత్రల కోసం సిద్ధం కావడానికి రోజూ కనీసం 2 నుంచి 3 గంటల సమయం పట్టేది. 

10వేలకు పైగా వివిధ రకాల ఆభరణాలను డిజైన్‌ చేశారు. వీటి మొత్తం బరువు 300 కేజీలకు పైనే.

సంజయ్‌ లీలా భన్సాలీ ఈ షోకు దర్శకత్వం వహించడమే కాదు, సంగీతాన్ని కూడా అందించడం గమనార్హం.

ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన షర్మిన్‌ సెగల్‌, సంజయ్‌ లీలా భన్సాలీకి మేనకోడలు. గాయకుడు, ఎడిటర్‌ బేలా సెగల్‌కు కుమార్తె.

దాదాపు 28ఏళ్ల తర్వాత భన్సాలీ, మనీషా కొయిరాలా కలిసి ఈ షో కోసం పని చేశారు. 1996లో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఖామోష్‌: ది మ్యూజికల్‌’వచ్చింది.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home