సోలంకి.. నౌటంకీ!

శ్రీసింహా హీరోగా నటించిన తాజా చిత్రం ‘భాగ్‌ సాలే’. జులై 7న విడుదలైన ఈ సినిమాలో హీరోయిన్‌గా నేహా సోలంకి నటించింది. 

Image: Instagram/nehasolanki

ఈమె ఇది వరకు తెలుగులో కార్తీకేయ ‘90ఎం.ఎల్‌’, ‘ఛలో ప్రేమిద్దాం’, ‘గూడుపుఠాణి’ చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.

Image: Instagram/nehasolanki

టాలీవుడ్‌లో చాలాకాలంగా ఉంటున్నా.. అనుకున్నంత సక్సెస్‌ ఈ బ్యూటీకి దక్కలేదు. ‘భాగ్‌ సాలే’లో మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

Image: Instagram/nehasolanki

ఉత్తరాఖండ్‌లోని హల్డ్వానిలో 1998 డిసెంబర్‌ 25న జన్మించిన నేహాకు చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి. నటి అవ్వాలని బలంగా నిర్ణయించుకుంది.

Image: Instagram/nehasolanki 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డిప్లామా చేసిన తర్వాత నటనపై ఫోకస్‌ పెట్టింది. అలా 2017లో జీ టీవీలో ప్రసారమైన ‘సేత్‌జీ’ హిందీ సీరియల్‌తో బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. 

Image: Instagram/nehasolanki

పలు సీరియళ్లు, బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘90 ఎం.ఎల్‌’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

Image: Instagram/nehasolanki

తెలుగు సినిమాలతోపాటు ‘ఎక్‌ బ్యాటరీ దో’ అనే హిందీ చిత్రంలోనూ మెరిసింది. తనకు 70 ఏళ్లు వచ్చే వరకూ నటించాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

Image: Instagram/nehasolanki

ప్రస్తుతం ఈ ఉత్తరాఖండ్‌ అందం.. ‘గేమ్‌ ఆన్‌’లో నటిస్తూనే.. ఇటీవల ప్రారంభమైన ‘తిత్లీ’ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తూ బిజీగా ఉంది. 

Image: Instagram/nehasolanki

నేహాకి డ్యాన్స్‌ చేయడమన్నా.. షాపింగ్‌కు వెళ్లడమన్నా చాలా ఇష్టం. ఇక రంగుల్లో నీలి రంగును, ఆహారంలో బూందీ రైతాను ఇష్టపడుతుందట. 

Image: Instagram/nehasolanki

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home