‘బ్రహ్మాస్త్ర’ ప్రత్యేకతలు ఇవే!
‘బ్రహ్మాస్త్ర’ ఐదేళ్ల క్రితం మొదలైంది. మూడు పార్టుల ఈ సినిమాలో తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర - 1: శివ’ సెప్టెంబరు 9న విడుదలవుతోంది.
Image:SocoalMedia
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించాడు.
Image:SocoalMedia
పెళ్లి తర్వాత రణ్‌బీర్ కపూర్ - ఆలియా కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే.
Image:SocoalMedia
సినిమాకు తొలుత ‘డ్రాగన్’ అనే పేరు పెడదాం అనుకున్నారట. హీరోకు, అగ్నికి సంబంధం ఉండటం వల్లనే అలా అనుకున్నారట. కానీ ‘బ్రహ్మాస్త్ర’ ఫైనల్ చేశారు.
Image:SocoalMedia
‘అస్త్రవెర్స్’గా పిలుస్తున్న ఈ సినిమా ట్రయాలజీలో మొదటి భాగం కోసం సుమారు రూ.400 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం.
Image:SocoalMedia
ఈ సినిమాను త్రీడీ, ఐమ్యాక్స్ త్రీడీ, 4డీఎక్స్, త్రీడీ ఫార్మాట్లలో వీక్షించొచ్చు. సాధారణ ఫార్మాట్‌లో తీసి, ఆయా ఫార్మాట్లలో కన్వర్ట్ చేశారట.
Image:SocoalMedia
సినిమాను 2017లో ప్రకటించారు. అప్పటికి ఆరేళ్ల ముందు నుంచి అయాన్ ముఖర్జీ ఈ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట.
Image:SocoalMedia
ఫిబ్రవరి 2018లో సినిమా చిత్రీకరణ బల్గేరియాలో ప్రారంభమైంది. మార్చి 29, 2022న వారణాసిలో పూర్తి చేశారు.
Image:SocoalMedia
సినిమాలో జల అస్త్రం, పవన అస్త్రం, అగ్ని అస్త్రం, వానరాస్త్రం, నంది అస్త్రం, బ్రహ్మాస్త్రం గురించి చూపిస్తారట
.Image:SocoalMedia
సినిమాను దేశంలో సుమారు 5,000 స్క్రీన్లలోను, విదేశాల్లో 3000కుపైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నట్లు భోగట్టా.
Image:SocoalMedia
సినిమా విడుదల ఇప్పటివరకు 5 సార్లు వాయిదా పడింది. చివరకు సెప్టెంబరు 9, 2022న విడుదలవుతోంది.
Image:SocoalMedia
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నారు. అయాన్ ముఖర్జీ కూడా తన లాంటివాడే అని.. అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నా అని అన్నారు జక్కన్న.
Image:SocoalMedia
అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా కలసి 18 ఏళ్ల తర్వాత నటించారు. వీరిద్దరూ ఆఖరిగా ‘హమ్ కౌన్ హై’లో ఆఖరిసారిగా కనిపించారు.
Image:SocoalMedia
సినిమా లోగోను 150 డ్రోన్లతో ప్రత్యేకంగా ఆకాశంలో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Image:SocoalMedia
నాగార్జున హిందీలో 16 ఏళ్ల తర్వాత నటించారు. ఆయన ఆఖరిగా ‘ఎల్‌వోసీ: కార్గిల్’ (2003)లో నటించారు.
Image:SocoalMedia