భారత్‌ vs పాక్‌: ఇప్పటివరకు ఏం జరిగింది?

 భారత్‌, పాకిస్థాన్‌ వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడాయి. అందులో పాక్‌ ఒక్కటి కూడా గెలవలేదు.

టీమ్‌ ఇండియా ఇప్పటివరకు రెండుసార్లు (1983, 2011) ప్రపంచకప్ గెలవగా.. పాక్‌ ఒకసారి (1992) మాత్రమే నెగ్గింది. 

ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌ అత్యధిక స్కోరు 336 (2019లో). పాక్‌ అత్యధిక పరుగులు 273 (1996లో).

వన్డే మహా సమరంలో పాక్‌పై భారత్‌ అత్యల్ప స్కోరు 216 (1992లో). పాకిస్థాన్‌ లోయెస్ట్‌ స్కోరు 173 (1992లో).

ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్‌ శర్మది. 2019లో ప్రపంచకప్‌లో 140 పరుగులు చేశాడు. 

దాయాది దేశాల మ్యాచుల్లో మన దేశం నుంచి బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శన మహ్మద్‌ షమీ ఇచ్చాడు. 2015 ప్రపంచకప్‌లో 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 

.

ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో లార్జెస్ట్‌ విక్టరీ భారత్‌దే. ఆసియా కప్‌ 2023లో 228 పరుగులతో పాక్‌ను ఓడించింది.

దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసింది సచిన్‌ తెందూల్కర్‌. 67 ఇన్నింగ్స్‌లో 2526 పరుగులు చేశాడు.

ఇండియా - పాక్‌ మ్యాచుల్లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు (ఒక మ్యాచ్‌లో) సయీద్‌ అన్వర్‌ది. 1997లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 194 పరుగులు చేశాడు.

దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసింది వసీమ్‌ అక్రమ్‌. 60 ఇన్నింగ్స్‌లో 48 వికెట్లు పడగొట్టాడు.

ఇండియా - పాక్‌ మ్యాచుల్లో ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన ఆకిబ్‌ జావెద్‌ది. 1991లో షార్జా వేదికగా జరిగిన మ్యాచులో 7 వికెట్లు పడగొట్టాడు.

ఎకానమీలో ఫెర్గూసన్‌ ది బెస్ట్‌.. ఆ తర్వాత వీరే!

క్రిస్‌ గేల్‌ రికార్డు బ్రేక్‌..

సూపర్‌ 8కి ఏ టీమ్‌ ఎలా వచ్చిందంటే?

Eenadu.net Home