GT x MI ఎవరిది పైచేయి?

ఐపీఎల్‌ తుది దశకు చేరుకుంది. క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో గుజరాత్‌ టైటన్స్‌, ముంబయి ఇండియన్స్‌ తలపడుతున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌లో చెన్నైను ఢీకొట్టనుంది.

Image: Twitter

లీగ్‌ దశలో గుజరాత్‌ 14 మ్యాచ్‌ల్లో 10 గెలిచి 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. క్వాలిఫయర్‌ 1లో చెన్నై చేతిలో ఓడి.. క్వాలిఫయర్‌ 2 ఆడుతోంది.

Image: Twitter

ఇక ముంబయి ఇండియన్స్‌ లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూను చిత్తు చేసి... ఇప్పుడు క్వాలిఫయర్‌ 2లో గుజరాత్‌తో పోటీ పడుతోంది.

Image: Twitter

గుజరాత్‌, ముంబయి ఇప్పటివరకు మొత్తం 3 సార్లు తలపడ్డాయి. రెండు సార్లు ముంబయి గెలవగా.. ఒకసారి గుజరాత్‌ విజయం సాధించింది.

Image: Twitter

ఐపీఎల్‌ 2022లో ముంబయి వేదికగా ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ టైటన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఆతిథ్య జట్టు 5 పరుగుల తేడాతో గెలుపొందింది. 

Image: Twitter

ఈ సీజన్‌లో గుజరాత్‌, ముంబయి తొలిసారిగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడ్డాయి. ఇందులో గుజరాత్‌ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Image: Twitter

ముంబయి వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై ముంబయి 27 పరుగుల తేడాతో గెలిచింది.

Image: Twitter

ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో గుజరాత్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌(722) రెండో స్థానంలో ఉన్నాడు. మరో 9 పరుగులు చేస్తే.. బెంగళూరు జట్టు కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌(730)ను దాటేసి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకునే అవకాశముంది.

Image: Twitter

సిక్సుల మోత.. హైదరాబాద్‌ మ్యాచే టాప్‌

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్స్‌ ఇవీ!

అందాల షెఫాలీ బగ్గా..

Eenadu.net Home