సోషల్ మీడియా ఫ్యాషన్ సుందరి సుహానా..
ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొత్త ఫొటోషూట్లతో సందడి చేస్తోంది.
2019లో ‘ద గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ’ షార్ట్‌ఫిల్మ్‌లో నటించి 2023లో ‘ద ఆర్చీస్’తో ఓటీటీలో మెరిసింది. చేసింది ఈ రెండు సినిమాలే అయినా ఈమె ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది.
2000లో ముంబయిలో పుట్టింది సుహానా. ధీరూబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది.
న్యూయార్క్ యూనివర్శిటీలో ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
వివిధ సౌందర్య ఉత్పత్తులకు, దుస్తుల బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. మ్యాగజైన్ కవర్ పేజీలకు పోజులిస్తుంది.
ఈమె నటి మాత్రమే కాదు ‘ద ఆర్చీస్’ కోసం గొంతు సవరించింది కూడా. ‘జబ్ తుమ్ నా తీన్’ పాట పాడి వాహ్.. అనిపించుకుంది.
లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌లకు వెళ్లడం అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో కలిసి మ్యూజికల్ నైట్‌లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
ఇన్‌స్టాలో ఆమె ఫొటోలకు క్రేజ్ ఎక్కువ. సుహానా ఇన్‌స్టా ఖాతాకి 60లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
సుహానా ఫిట్‌నెస్ ఫ్రీక్. ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో గంటలకొద్దీ వ్యాయామం చేస్తుంది.
క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడడం నచ్చుతుంది. IPLలో KKR మ్యాచ్‌లకు స్టేడియంలో సందడి చేస్తుంది.
‘గోవా ఫేవరెట్ స్పాట్. ఎన్ని సార్లు వెళ్లినా అస్సలు బోర్ కొట్టదు. బీచ్, ఫ్రెండ్స్ ఉంటే చాలు’ అంటోంది.