ఇంటి అందమంతా అలంకరణలోనే ఉంది కదా...!
ఇల్లు కట్టుకోగానే సరిపోదు.. దాన్ని అందంగా అలంకరించడమూ ముఖ్యమే.
image:RKC
కొత్త ఇంటిలో చేసే ఇంటీరియర్.. ఇంటికి మరింత అందాన్ని తెస్తుంది. వాల్స్, డోర్స్, స్టెయిర్‌వాల్, ఫ్లోర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉండాలి.
image:RKC
ఇంట్లో హాలు, వంటగది, చిన్నారుల రీడింగ్ రూం, భార్యాభర్తలు, చిన్నారుల పడక గదితో పాటు అతిథులకు ఏర్పాటు చేసే గదుల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పాటు విభిన్నత చూపించాలి.
image:RKC
గదికి తగినట్లు ఫర్నీచర్ అమర్చడం పెద్ద కళ. హాలులో టీవీ టేబుల్, టీపాయ్, సోఫాలు సరైన చోట పెట్టాలి. చిన్నారుల గదుల్లో రీడింగ్ టేబుల్, చేతికి అందేలా వర్డ్‌రోబ్ ఉండాలి. బెడ్‌రూమ్‌లో మంచం, డ్రెస్సింగ్ టేబుల్, టేబుల్ ల్యాంప్ వంటివి ఉండాలి.
image:RKC
గోడలకు వేసే రంగుల విషయంలో శ్రద్ధ పెట్టాలి. చిన్నారుల గదుల్లో లేత రంగులు, భార్యాభర్తలుండే గదిలో ఆహ్లాదకరంగా కనిపించే రంగులను ఎంచుకోవాలి. హాలులో మిక్స్‌డ్ రంగులు ఆకట్టుకుంటాయి.
image:RKC
గోడలకు రంగులు వేసి ఖాళీగా ఉంచితే ఏం బాగుంటుంది? మీ అభిరుచికి తగిన చిత్రాలు, కుటుంబంతో దిగి ఫొటోలను ఫ్రేమ్ చేయించి పెట్టుకుంటే చూడటానికి చక్కగా ఉంటుంది.
image:RKC
ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఆహ్లాదం, ఆరోగ్యం. అందుకే, వాటిని బాల్కానీ, టెర్రస్‌పై పెంచుకోవచ్చు. అందానికి, ఆరోగ్యానికి రకరకాల మొక్కలు మార్కెట్లో లభిస్తున్నాయి.
image:RKC
ఇంట్లోనే మీకంటూ ఆఫీస్ గదిని నిర్మించుకుంటే.. మీ వస్తువులన్నీ కనిపించేలా చక్కగా సెల్ఫ్స్, టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలి.
image:RKC