అంతర్జాతీయ చేతి పరిశుభ్రతా దినోత్సవం.. అక్టోబర్‌ 15

 చేతులు శుభ్రంగా లేకపోవడం వల్లే చాలా వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంటే సగం వ్యాధుల్ని అరికట్టినట్లే. అందుకే, ఏటా అక్టోబర్‌ 15న ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహిస్తూ చేతులు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు.

ది గ్లోబల్‌ హ్యాండ్‌వాషింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ అనే సంస్థ 2008లో తొలిసారి ఈ చేతి పరిశుభ్రత దినోత్సవాన్ని ప్రారంభించి, ఏటా కొనసాగిస్తోంది. 

సంక్రమిత వ్యాధుల్లో దాదాపు 80 శాతం వ్యాధులు చేతుల స్పర్శతోనే వస్తాయట. 

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చేతుల్ని కడగడం కేవలం 6 సెకండ్లలోనే పూర్తి చేస్తున్నారట. 5 శాతం మంది మాత్రమే చేతుల్ని సరిగ్గా శుభ్రం చేసుకుంటున్నారట.

ప్రపంచ జనాభాలో 33 శాతం మంది మాత్రమే చేతుల్ని శుభ్రం చేసుకునే సమయంలో సబ్బును, హ్యాండ్‌ వాష్‌ని ఉపయోగిస్తున్నారట. 

చేతుల్ని చక్కగా శుభ్రం చేసుకోవడం ద్వారా డయేరియా సోకే పరిస్థితిని 40 శాతం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ను 20 శాతం మేర తగ్గించుకోవచ్చు. 

ఫుడ్‌పాయిజన్‌ అవడానికి 50 శాతం కారణం చేతులు శుభ్రంగా లేకపోవడమే. 

చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ వంటి హానికర సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించవు. దీంతో వ్యాధులు దరిచేరవు. 

 చేతుల్ని తడి చేసుకొని సబ్బు రుద్దుకోవాలి. చేతి వేళ్లు, అరచేయి, గోళ్ల కింద అంతటా సబ్బుతో 20 సెకండ్లపాటు రుద్దుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగి పొడి వస్త్రంతో తుడుచుకోవాలి.

బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు, తినకముందు, తిన్న తర్వాత, జంతువుల్ని తాకినప్పుడు, తుమ్మినప్పుడు/దగ్గినప్పుడు చేయి అడ్డుపెడుతుంటాం.. ఆ సమయంలో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.

చేతులు క్లీన్‌ చేసుకునేందుకు చల్లటి నీళ్లు వాడినా.. వేడి నీళ్లు వాడినా తేడా ఉండదు. రెండూ సూక్ష్మజీవుల్ని తరిమికొట్టడంలో ఒకేలా పనిచేస్తాయి.

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home