ఇంటర్నెట్ గురించి మీకివి తెలుసా? 

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని కోసం ఇంటర్నెట్‌ను వినియోగిస్తూనే ఉన్నాం. మరి ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి.

Image:RKC 

ప్రపంచంలో ఇంటర్నెట్‌ సేవలు తొలిసారిగా అక్టోబర్‌ 29, 1969న ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 29, 2005 నుంచి ఇంటర్నేషనల్‌ ఇంటర్నెట్‌ డేను జరుపుతున్నారు.

Image:RKC

ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో మొదటిసారి ఒక కంప్యూటర్‌ నుంచి మరో కంప్యూటర్‌కు సందేశాన్ని పంపించారు. అప్పట్లో దీన్ని (అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్- ARPANET) అని పిలిచేవారు.

Image:RKC 

2020 లెక్కల ప్రకారం భారతదేశంలో 749 మిలియన్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ను వినియోగించారట! 2015లో 302.36 మిలియన్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ వినియోగించగా.. 2022కు 932.22 మిలియన్లకు పెరిగింది.

Image:RKC 

ప్రపంచవ్యాప్తంగా 5.7 బిలియన్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. అంటే ప్రపంచ జనాభాలో సుమారు 63.5 శాతం మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారన్నమాట!

Image:RKC 

2016 లెక్కల ప్రకారం భారత్‌లో 70శాతం మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తే అందులో 70 శాతం పురుషులు, 30 శాతం స్త్రీలు ఉన్నట్లు తెలిసింది. 2020 వచ్చేసరికి 60 శాతం పురుషులు, 40 శాతం స్త్రీలు వినియోగిస్తున్నారు.

Image:RKC

 అంతర్జాల సేవలను వినియోగించే వారి సంఖ్య 2040 నాటికి 1,532.3 మిలియన్లకు చేరుతుందని గణాంక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Image:RKC

2022 జనవరి గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల్లో ఇంటర్నెట్‌ వినియోగంలో చైనా (1,020 మిలియన్లు) ముందువరుసలో ఉంది.

Image:RKC 

భారత్‌ 658 మిలియన్లు, అమెరికా 307.2 మిలియన్లు, ఇండోనేషియా 204.7 మిలియన్లు, బ్రెజిల్ 165.3 మిలియన్లు, రష్యా 129.8 మిలియన్ల మంది వినియోగించగా.. ఇటలీ 50.85 మిలియన్ల మంది వినియోగంతో చివరి స్థానంలో ఉంది.

Image:RKC  

 ఇంటర్నెట్‌ వేగాన్ని బిట్‌ ఫర్‌ సెకండ్లలో కొలుస్తారు.1 Kbps (kilobits/sec)=1,000 bits/sec, 1 Mbps (megabits/sec)=1 million bits/sec, 1 Gbps (gigabits/sec)=1 billion bits/sec.

Image:RKC 

ఎక్కువగా స్ట్రీమింగ్‌ యాప్స్‌ ( నెట్‌ఫ్లిక్స్‌, స్టాన్‌, ఫాక్స్‌టెల్), సోషల్‌ మీడియా (ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌), GPS,Uber, Maps యాప్‌ల వినియోగానికి ఎక్కువ ఇంటర్నెట్‌ అవసరమట!

Image:RKC 

వాట్సాప్‌లో ఒక సందేశాన్ని పంపించాలంటే 30KB, ఒక నిమిషం పాటు వీడియో కాల్ చేసేందుకు 750KB, ఒక సెకన్‌ వాయిస్‌ మెసేజ్‌ పంపించాలంటే 6KB ఇంటర్నెట్‌ ఖర్చవుతుంది. ఒక గంటసేపు ఫేస్‌బుక్‌ వాడేందుకు 100 MB ఇంటర్నెట్‌ కావాలి.

Image:RKC 

వినియోగదారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు మన దేశంలో కొన్ని టెలికాం కంపెనీలు ఇటీవల 5G ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Image:RKC 

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home