‘హలో’ గార్గేయి..
‘ఎవరికీ చెప్పొద్దు’ అంటూ హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన తెలుగింటి అమ్మాయి.. గార్గేయి ఎల్లాప్రగడ. తాజాగా ఈమె మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Image: Instagram/Gargeyi
మీరా అనే ఒకే ఒక్క పాత్రతో విభిన్నంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హలో మీరా’. ఇందులో ఉన్న ఆ పాత్రనే గార్గేయి పోషించింది.
Image: Instagram/Gargeyi
ఏప్రిల్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. గార్గేయి నటనలోనూ పరిణతి కనిపిస్తోంది.
Image: Instagram/Gargeyi
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన గార్గేయికి చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండేది.
Image: Instagram/Gargeyi
పదేళ్ల వయసులోనే ఓ సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా చదువు కోసం నటనకు దూరమైంది.
Image: Instagram/Gargeyi
కాలేజీలో చేరిన తర్వాత మళ్లీ సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆడిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లేదట.
Image: Instagram/Gargeyi
This browser does not support the video element.
అలా వచ్చిన అవకాశమే.. ‘ఎవరికీ చెప్పొద్దు’. తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో హీరోయిన్‌గా నటించింది.
Image: Instagram/Gargeyi
ఓ వైపు చదువును కొనసాగిస్తూనే సినిమా చిత్రీకరణలో పాల్గొందట.
Image: Instagram/Gargeyi
తొలి చిత్రంతోనే గార్గేయి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అవకాశాలూ వస్తున్నాయి.
Image: Instagram/Gargeyi
గార్గేయికి హీరోల్లో మహేశ్‌బాబు, హీరోయిన్లలో అనుష్క అంటే చాలా ఇష్టమట.
Image: Instagram/Gargeyi