తన సోదరి కంటే క్రేజీ.. ఈ సుందరి

‘చిరుత’తో టాలీవుడ్‌కి పరిచయమైన హీరోయిన్‌ నేహా శర్మ. ఈ బాలీవుడ్‌ బ్యూటీకి సోషల్‌మీడియాలో ఎంత పాపులారిటీ ఉందో.. ఆమె సోదరి అయిషా శర్మకి కూడా అంతే క్రేజ్‌ ఉంది.

Image: Instagram/aishasharma

నేహా శర్మలాగే ఈమె కూడా చాలా బోల్డ్‌. పొట్టి దుస్తుల్లో ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తోంది.

Image: Instagram/aishasharma

ఇంజినీరింగ్‌ చదివిన ఈ భామ.. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.

Image: Instagram/aishasharma

లాక్మే, పెప్సీ తదితర బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లో నటించింది. 

Image: Instagram/aishasharma

తొలిసారి 2016లో ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి ‘ఇక్‌ వారీ’ వీడియో ఆల్బమ్‌లో మెరిసింది. 

Image: Instagram/aishasharma

ఆ తర్వాత 2018లో జాన్‌ అబ్రహం ‘సత్యమేవ జయతే’లో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

Image: Instagram/aishasharma

ఆ తర్వాత సినిమా అవకాశాలేవీ పెద్దగా రాలేదు. కానీ, వీడియో ఆల్బమ్స్‌లో తళుక్కుమంటోంది. 

Image: Instagram/aishasharma

నేహా, అయిషా కలిసి ‘షైనింగ్‌ విత్‌ ది శర్మాస్‌’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

Image: Instagram/aishasharma

తన అందచందాలతో నెట్టింట్ట వైరల్‌ అవుతూ.. యువతను తెగ ఆకర్షిస్తోంది అయిషా.

Image: Instagram/aishasharma

గత డిసెంబర్‌లో సోదరితో కలిసి గోవాలో ఎంజాయ్‌ చేస్తూ.. ఫొటోలకు పోజులిచ్చింది.

Image: Instagram/aishasharma

ఈ సుందరి.. స్కిన్‌కేర్‌ ఎక్స్‌పర్ట్‌ కూడా. చర్మ సంరక్షణపై సలహాలు ఇస్తూ.. తగిన సౌందర్య సాధనాలను ప్రమోట్‌ చేస్తుంటుంది.

Image: Instagram/aishasharma

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.7 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image: Instagram/aishasharma

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home