మిస్‌ యూనివర్స్‌ పోటీలో దివితా రాయ్‌.. 

జనవరి 14న జరిగే మిస్‌ యూనివర్స్‌-2022 పోటీల్లో భారత్‌ తరఫున మిస్‌ యూనివర్స్‌ ఇండియా దివితా రాయ్‌ పాల్గొనబోతోంది. ఇంతకీ ఈమె ఎవరు? తెలుసుకుందాం పదండి..

Image: Instagram/DivitaRai

దివిత కర్ణాటకకు చెందిన మోడల్‌.. 1998 జనవరి 10న మంగళూరులో జన్మించింది. ఇంటర్మీడియట్‌ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదువుకుంది.

Image: Instagram/DivitaRai

ముంబయిలోని సర్‌. జె.జె కాలేజ్‌ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో బి.ఆర్క్‌ డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్‌, సినీరంగంపై ఇష్టంతో ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

Image: Instagram/DivitaRai

బాలీవుడ్‌లో సినిమా సెట్‌ డిజైనర్‌గా పనిచేస్తూ.. మోడలింగ్‌ చేసేది. అనేక ఫ్యాషన్‌ షోల్లోనూ పాల్గొంది. 

Image: Instagram/DivitaRai

మిస్‌ దివా - 2021 పోటీల్లో దివిత పాల్గొంది. కానీ, అందులో హర్నాజ్‌ సంధూ విజేత కాగా.. దివిత రెండో రన్నరప్‌గా నిలిచింది. ఇదే అందాల పోటీలో మిస్‌ ఐక్యూ, మిస్‌ లైఫ్‌స్టైల్‌, మిస్‌ సుడోకు టైటిల్స్‌ సొంతం చేసుకుంది దివిత.

Image: Instagram/DivitaRai

గతేడాది ఆగస్టు 22న మిస్‌ దివా యూనివర్స్‌ 2022గా ఎంపికైంది. దీంతో మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీకి సిద్ధమైంది. ఈ పోటీల్లో గెలిస్తే మరోసారి ఆ కిరీటం భారత్‌కే దక్కుతుంది.

Image: Instagram/DivitaRai

చదువు విలువ దివితకు తెలుసు. అందుకే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బాలికలకు విద్య అందాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాలు చేపడుతోంది. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది.

Image: Instagram/DivitaRai

‘అమ్మాయిలకు విద్య చాలా అవసరం. చదువుకుంటేనే వారి జీవితాలను వారే మార్చుకునే అవకాశం దక్కుతుంది’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Image: Instagram/DivitaRai

దివితకు మ్యూజిక్‌ వినడం, రకరకాల వంటలు చేయడం అంటే చాలా ఇష్టమట. 

Image: Instagram/DivitaRai

ఈ భామ బహుముఖ ప్రజ్ఞాశాలి. బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌ ఆడుతుంది. చక్కగా పెయింటింగ్స్‌ వేస్తుంది.

Image: Instagram/DivitaRai

టాప్‌-10 స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లు.. అస్సలు మిస్సవ్వదు

సినిమాల కోసం ఏమైనా చేస్తా..!

శ్రీవల్లి సంగతులు.. చిత్రాల్లో

Eenadu.net Home