గింత అందమేంది గిగి

నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభ వేడుకలో అమెరికన్‌ మోడల్‌ గిగి హాడిడ్‌.. భారతీయత ఉట్టిపడేలా బంగారం, తెలుపు రంగు వస్త్రధారణలో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

Image: Instagram/Gigi Hadid

ఈ వేడుకలో గిగిని బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఎత్తుకొని ముద్దుపెట్టిన వీడియో తెగ వైరల్‌ అయింది.

Image: Instagram/Gigi Hadid

భారత్‌లో పర్యటన తనకు మరిచిపోలేని మధురస్మృతుల్ని అందించిందంటూ గిగి తన ఇన్‌స్టా ఖాతాలో ఫొటోలు పోస్టు చేసింది.

Image: Instagram/Gigi Hadid 

గిగి పూర్తి పేరు.. జెలినా నౌరా గిగి హాడిడ్‌.. అమెరికాలోని లాస్‌ ఏంజిలెస్‌లో 1995 ఏప్రిల్‌ 23న జన్మించింది. తండ్రి పాలస్తీనాకు చెందిన వ్యాపారి. తల్లి నెదర్లాండ్స్‌కు చెందిన మోడల్‌. 

Image: Instagram/Gigi Hadid

రెండేళ్ల వయసులోనే గిగి మోడలింగ్‌ చేసింది. తన తల్లికి తెలిసిన ‘బేబీ గెస్స్‌’ సంస్థ క్యాంపెయిన్‌ కోసం గిగి అంత చిన్న వయసులోనే మోడల్‌గా మారింది.

Image: Instagram/Gigi Hadid

పాఠశాల విద్య పూర్తవగానే న్యూయార్క్‌లోని ది న్యూ స్కూల్‌ యూనివర్సిటీలో క్రిమినల్‌ సైకాలజీ డిగ్రీలో చేరింది. మోడలింగ్‌లోనే తన జీవితమని చదువుకు స్వస్తి పలికింది. 

Image: Instagram/Gigi Hadid

తన తల్లిలాగే మోడల్‌గా రాణించాలని భావించిన గిగి 2011లో మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అంతర్జాతీయ మోడలింగ్‌ ఏజెన్సీ ‘ఐఎంజీ మోడల్స్‌’తో ఒప్పందం తర్వాత గిగి జీవితం మారిపోయింది.

Image: Instagram/Gigi Hadid

న్యూయార్క్‌ ఫ్యాషన్‌ షో సహా అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోల్లో మోడలింగ్‌ చేసి ఫ్యాషన్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె అమెరికాలో ఓ సూపర్‌ మోడల్‌. 

Image: Instagram/Gigi Hadid

అనేక ప్రచార చిత్రాల్లో నటించిన గిగి.. అంతర్జాతీయ ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ల కవర్‌పేజీలపై కనువిందు చేసింది. 

Image: Instagram/Gigi Hadid

దాదాపు 10కిపైగా చిత్రాలు, టీవీషోల్లో గిగి అతిథి పాత్రల్లో మెరిసింది. పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది. 

Image: Instagram/Gigi Hadid

బ్రిటీష్‌ సింగర్‌ జేన్‌ మాలిక్‌తో ప్రేమలో పడ్డ గిగి.. 2020లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతడితో విభేదాలు ఏర్పడి విడిపోయింది. 

Image: Instagram/Gigi Hadid

ప్రస్తుతం ఈ భామ.. లియోనార్డో డికాప్రియోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఇటీవల పారిస్‌ వీధుల్లో చక్కర్లు కొట్టడమే దీనికి కారణం. 

Image: Instagram/Gigi Hadid

ఈ అందాల రాశి.. సామాజిక సేవలోనూ ముందుంటుంది. పలు కార్యక్రమాల్లో పాల్గొని.. విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తుంటుంది. చిన్నారుల కోసం యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తోంది.

Image: Instagram/Gigi Hadid

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home