సక్కదనాల సుక్క.. సబా ఆజాద్‌!

బాలీవుడ్‌ గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌.. నటి సబా ఆజాద్‌ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ‘నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌’ ప్రారంభ వేడుకకు హాజరయ్యారు. 

Image: Instagram/Saba Azad

నలుపు రంగు దుస్తుల్లో హృతిక్‌ రాగా.. ఎరుపు రంగు మోడ్రన్‌ దుస్తుల్లో సబా ఆకట్టుకుంది.

Image: Instagram/Saba Azad

సబా బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా మాత్రమే కాదు.. నాటకాలకు దర్శకత్వం వహిస్తోంది. సంగీత దర్శకురాలిగా.. గాయనిగా తన ప్రతిభ చాటుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘ఫర్జీ ’ వెబ్‌సిరీస్‌లోనూ ‘సబ్‌ ఫర్జీ’ పాట పాడింది సబా. 

Image: Instagram/Saba Azad

ఈ భామ ప్రముఖ నాటకరంగ కళాకారుడు, దర్శకుడు, కవి సఫ్దార్‌ హష్మి మేనకోడలు. ఆయన నాటకబృందంతోనే నాటకాల్లో పాల్గొనేది. 

Image: Instagram/Saba Azad

సబా.. మంచి డ్యాన్సర్‌ కూడా. ఒడిస్సీ, క్లాసికల్‌ బ్యాలెట్‌, జజ్‌, లాటిన్‌ ఇలా అనేక కాంటెంపరరీ డ్యాన్సుల్లో శిక్షణ తీసుకుంది.

Image: Instagram/Saba Azad

దిల్లీలో 1985 నవంబర్‌ 1న జన్మించిన సబా.. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే పలు షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించింది. ఈమె నటించిన ‘గురూర్‌’ న్యూయార్క్‌ ఫిల్మ్‌, ఫ్లోరెన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ వరకూ వెళ్లింది. 

Image: Instagram/Saba Azad

సబా 2008లో బాలీవుడ్‌ చిత్రం ‘దిల్‌ కబడ్డీ’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ‘ముఝ్‌సే ఫ్రాండ్షిప్‌ కరోగీ’ చిత్రాల్లో నటించింది. 

Image: Instagram/Saba Azad

ఆ తర్వాత కూడా పలు షార్ట్‌ఫిల్మ్స్ చేసిన సబా.. ‘లేడీస్‌ రూమ్‌’, ‘లవ్‌ షార్ట్స్‌2, ‘ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌’, ‘రాకెట్‌ బాయ్స్‌’ వెబ్‌సిరీస్‌ల్లో మెరిసింది. 

Image: Instagram/Saba Azad

క్యాడ్‌బెరీ, మ్యాగీ, టాటా స్కై, కిట్‌క్యాట్‌, సన్‌సిల్క్‌, నెస్కేఫ్‌ ఇలా అనేక బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లోనూ తళుక్కుమంది సబా. 

Image: Instagram/Saba Azad

నటిగా కంటే.. సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే సబా.. ‘మ్యాడ్‌ బాయ్‌/మింక్‌’ బ్యాండ్‌తో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చేది. అందుకే, నటనకు దూరంగా ఉంటోంది. 

Image: Instagram/Saba Azad

సబా సంగీత ప్రదర్శనలకు అప్పుడప్పుడు హృతిక్‌రోషన్‌ కూడా వెళ్లి.. తనను ప్రోత్సహిస్తుంటాడు. 

Image: Instagram/Saba Azad

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home