దంగల్ బ్యూటీ - అప్పుడు రెజ్లర్.. ఇప్పుడు పోలీస్
‘దంగల్’లో రెజ్లర్ బబితా కుమారిగా కనిపించి ఆకట్టుకుంది నటి సాన్య మల్హోత్రా. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Image: Instagram/sanyamalhotra
సాన్య నటించిన ‘కథల్ - ఏ జాక్‌ఫ్రూట్ మిస్టరీ’ నెట్‌ఫ్లిక్స్‌లో మే 19న విడుదలకానుంది. ఈ విషయాన్ని తనే సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.
Image: Instagram/sanyamalhotra
‘కథల్..’ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న ఈ బాలీవుడ్ సుందరి.. తాజాగా దిల్లీకి వెళ్లి.. తాను చదువుకున్న కాలేజ్‌ను సందర్శించింది.
Image: Instagram/sanyamalhotra
దిల్లీలో పుట్టి పెరిగిన ఈ దంగల్ బ్యూటీ.. గార్గీ కాలేజ్‌లో డిగ్రీ చేసింది.
Image: Instagram/sanyamalhotra
కాంటెంపరరీ, బ్యాలెట్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’షోలో పాల్గొన్నా.. పోటీలో నిలవలేకపోయింది.
Image: Instagram/sanyamalhotra
చిన్నతనం నుంచే నటనంటే ఆసక్తి. అద్దంలో తనని తాను చూసుకుంటూ డైలాగులు చెప్పేదట.
Image: Instagram/sanyamalhotra
చదువు పూర్తికాగానే నటి అవ్వాలన్న తన కోరిక గురించి తల్లిదండ్రులకు చెప్పి ముంబయికి మకాం మార్చేసింది.
Image: Instagram/sanyamalhotra
టీవీ యాడ్స్ షూటింగ్స్‌లో కెమెరామెన్‌కు సహాయకురాలిగా పని చేస్తూనే.. సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌లో పాల్గొనేది.
Image: Instagram/sanyamalhotra
అలా.. తొలిసారి ‘దంగల్’లో అవకాశం లభించింది. ఈ భామకు అసలు రెజ్లింగ్ గురించి ఏమీ తెలియదు. సినిమా కోసం రెజ్లింగ్‌లో 11 నెలలు శిక్షణ తీసుకుంది.
Image: Instagram/sanyamalhotra
‘దంగల్’తో వచ్చిన పాపులారిటీ.. అవకాశాలను తెచ్చి పెట్టింది. అలా ‘పటాకా’, ‘బదాయ్ హో’, ‘ఫొటోగ్రాఫ్’, ‘శకుంతలా దేవి’, ‘లూడో’, ‘మీనాక్షి సుందరేశ్వర్’, ‘హిట్’, తదితర సినిమాల్లో నటించింది.
Image: Instagram/sanyamalhotra
సాన్యకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండటంతో అమీర్‌ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లోని ఓ పాటకు కొరియోగ్రాఫ్ చేసింది.
Image: Instagram/sanyamalhotra
సాన్య ప్రస్తుతం షారుక్‌ఖాన్ ‘జవాన్’, ‘శామ్ బహదూర్’లో నటిస్తోంది.
Image: Instagram/sanyamalhotra
ఈ బ్యూటీకి బోల్డ్‌నెస్ ఎక్కువే. సోషల్‌మీడియాలో గ్లామర్ ఫొటోలతో యువతను ఆకట్టుకుంటోంది.
Image: Instagram/sanyamalhotra
ఇన్‌స్టాలో ఈమెకు 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/sanyamalhotra