అదిరింది అమ్మీ.. షహానా గోస్వామి!

కామెడీషోతో పాపులర్‌ అయిన కపిల్‌ శర్మ.. తాజాగా నటించిన చిత్రం ‘జ్విగాటో’. ఇందులో కపిల్‌కి జోడీగా షహనా గోస్వామి నటించింది.

Image: Instagram/Shahana Goswami

ఈ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకపోయినా.. షహనా నటనకు ప్రశంసలు లభించాయి. దీంతో ఈ భామ గురించి నెట్టింట తెగ అన్వేషిస్తున్నారు. 

Image: Instagram/Shahana Goswami

దిల్లీలో జన్మించిన షహనా గోస్వామి.. ముంబయిలో డిగ్రీ చదువుకుంది. స్నేహితుల సూచనతో ఆడిషన్‌కు వెళ్లిన ఈ భామ ఇప్పటివరకు 20కిపైగా సినిమాల్లో నటించింది. 

Image: Instagram/Shahana Goswami

తొలిసారి షహనా ‘యూ హోతా తో క్యా హోతా(2006)’తో వెండితెరకు పరిచయమైంది. అవకాశాలు క్యూ కట్టడంతో వరుసపెట్టి సినిమాలు చేసింది.

Image: Instagram/Shahana Goswami

‘రాక్‌ ఆన్‌’లో షహనా నటనకు ఉత్తమ నటి(క్రిటిక్స్‌) ఫిల్మ్‌ఫేర్‌ సహా నాలుగు అవార్డులు దక్కాయి. 

Image: Instagram/Shahana Goswami

బాలీవుడ్‌లోనే కాదు.. ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రెన్‌’, ‘వరా: ది బ్లెస్సింగ్‌’, ‘ఫోర్స్‌ ది డెస్టినీ’ ఇంగ్లీష్‌ చిత్రాల్లో మెరిసింది. 

Image: Instagram/Shahana Goswami

బంగ్లాదేశ్‌లో తెరకెక్కించిన చిత్రాలు ‘అండర్‌ కన్‌స్ట్రక్షన్‌’, ‘మేడ్‌ ఇన్‌ బంగ్లాదేశ్‌’లోనూ నటించింది.

Image: Instagram/Shahana Goswami

ఆ తర్వాత సినిమాల్లో జోరు తగ్గించి.. అడపాదడపా వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తోంది. అలా ‘బాంబే బేగమ్స్‌’, ‘ది లాస్ట్‌ అవర్‌’, ‘హుష్‌ హుష్‌’లో నటించింది షహనా.

Image: Instagram/Shahana Goswami

ఎక్కువ సినిమాల్లో నటించాలని తనకు లేదని.. కథ మనసుకు నచ్చితేనే చేస్తానని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది షహనా. 

Image: Instagram/Shahana Goswami

‘ఉమ్రావ్‌ జాన్‌’ వంటి చిత్రంలో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది. 

Image: Instagram/Shahana Goswami

ఈ రాక్‌ ఆన్‌ స్టార్‌కి బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ ఆడటం, విహారయాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం.

Image: Instagram/Shahana Goswami

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తరచూ తన గ్లామర్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ ఉంటుంది.

Image: Instagram/Shahana Goswami

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home