సిమ్రన్.. అందంతో మురిపించెన్!
విజయ్ ధరణ్, అనన్య నాగళ్ల తదితరులు కలిసి నటిస్తోన్న చిత్రం ‘అన్వేషి’. ఇందులో సిమ్రన్ గుప్తా కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
Image: Instagram/Simran gupta
ఈ ముంబయి బ్యూటీ గతంలో ‘తాగితే తందాన’అనే చిత్రంలోనూ నటించింది. ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందకపోవడంతో ఈమెకు గుర్తింపు దక్కలేదు.
Image: Instagram/Simran gupta
సిమ్రన్ ముంబయిలోనే పుట్టిపెరిగింది. చదువు పూర్తికాగానే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. పలు బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లోనూ నటించింది.
Image: Instagram/Simran gupta
ఈ భామ మంచి డ్యాన్సర్ కూడా. బాలీవుడ్, కాంటెపరరీ, హిప్‌హప్, జాజ్ ఫంక్, క్లాసికల్, సెమీ క్లాసికల్ డ్యాన్స్ రీతుల్లో శిక్షణ తీసుకుంది.
Image: Instagram/Simran gupta
జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది. 2014లో డిడీ ఛానల్‌లో ప్రసారమైన ‘భారత్‌కి షాన్ లెట్స్ డ్యాన్స్’ షోలో విజేతగా నిలిచింది.
Image: Instagram/Simran gupta
మోడలింగ్‌లో బిజీగా ఉన్న సిమ్రన్.. ‘తాగితే తందాన’లో నటించి తెలుగు వారిని పలకరించింది. ఇప్పుడు ‘అన్వేషి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Image: Instagram/Simran gupta
This browser does not support the video element.
తమిళ కమెడియన్ సతీష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వాతైకరన్’తో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇది వరకు విజయ్ ‘సర్కార్’లోని స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది.
Image: Instagram/Simran gupta
కెమెరా ముందు నటించడం తనకెంతో ఇష్టమని సిమ్రన్ చెప్పింది. ఛాలెంజింగ్‌గా అనిపించే భిన్నమైన పాత్రలు పోషించాలని ఉందట.
Image: Instagram/Simran gupta
స్టైల్‌లో సోనమ్ కపూర్, దీపికా పదుకొణెకు తను అభిమానినని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Image: Instagram/Simran gupta