టాలీవుడ్‌లో మరో కన్నడ భామ!

చాలాకాలం తర్వాత సాయి రామ్‌ శంకర్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’. ఇందులో యశ శివకుమార్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Image: Yasha Shivakumar

తాజాగా విడుదలైన టీజర్‌లో యశ ఎంతో అందంగా కనిపించింది. ఇంతకీ ఈ భామ ఎవరంటే..

Image: Yasha Shivakumar

కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగింది యశ. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసింది.

Image: Yasha Shivakumar

చదువుతున్న రోజుల్లోనే యశకు మోడలింగ్‌పై ఆసక్తి కలిగింది. దీంతో ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టింది.  

Image: Yasha Shivakumar

పలు అందాల పోటీల్లో పాల్గొన్న యశ.. 2019లో మిస్‌ బెంగళూరు, మిస్‌ కర్ణాటక ఇంటర్నేషనల్‌, మిస్‌ గ్లోరీ గెలాక్సీ టైటిల్స్‌ గెలుచుకుంది. 

Image: Yasha Shivakumar

ఆ తర్వాత సినిమా ఆడిషన్స్‌ ఇవ్వగా.. కన్నడలో తెరకెక్కిన ‘పదవి పూర్వా’, తుళులో తీసిన ‘రాజ్‌ సౌండ్స్‌ అండ్‌ లైట్స్‌’ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి.

Image: Yasha Shivakumar

ఆ తర్వాత తెలుగులో వచ్చిన కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌.. ‘మాన్‌సూన్‌ రాగ’, శివరాజ్‌కుమార్‌ ‘భైరాగి’లోనూ నటించింది. ఈ సినిమాలన్నీ గతేడాదే విడుదలయ్యాయి.  

Image: Yasha Shivakumar

యశ గ్లామర్‌ను ఇప్పుడు దర్శకుడు నవీన్‌రెడ్డి ‘వెయ్‌ దరువెయ్‌’తో టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు.

Image: Yasha Shivakumar

ఈ కన్నడ భామ భరతనాట్యం డాన్సర్‌. కథక్‌, ఫ్రీస్టైల్‌, బాలీవుడ్‌, మణిపురి నృత్యాల్లోనూ శిక్షణ తీసుకుంది. 

Image: Yasha Shivakumar

హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

Image: Yasha Shivakumar

ఈ క్రమంలో తరచూ ఫొటోషూట్స్‌లో పాల్గొని.. తన గ్లామర్‌ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

Image: Yasha Shivakumar

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

Eenadu.net Home