ముగ్ధ ‘మనోహరి..’ నోరా ఫతేహి

నోరా ఫతేహి గురించి విన్నారా.. ‘బాహుబలి 1’లో ‘మనోహరి...’ అంటూ ఆడిపాడిన ఆ ముగ్గురు భామల్లో ఈమె ఒకరు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ ‘మట్కా’లో నటించనుంది.

(photos:instagram/norafatehi)

‘మట్కా’లో ఇద్దరు కథానాయికలున్నారు.. మీనాక్షి చౌదరితో పాటు నోరా ఫతేహి కూడా వరుణ్‌ సరసన ఆడిపాడనుంది. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.

నోరా పుట్టి పెరిగింది కెనడాలో. టోరెంటోలోని యార్క్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకుంది.

బెల్లీ డ్యాన్స్‌ అంటే ఈ భామకు ఇష్టమట. ఎలాంటి శిక్షణ లేకుండానే.. ఇంటర్నెట్‌లో వీడియోలు చూసి బెల్లీ డ్యాన్స్‌ నేర్చేసుకుందట. యాక్టింగ్‌పై ఉన్న ఆసక్తితో మోడలింగ్‌ వైపు అడుగులేసింది.

ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రకటనల్లో మోడల్‌గా చేసింది. దాంతో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. 2014లో బాలీవుడ్‌ చిత్రం ‘రోర్‌’తో పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

‘టెంపర్‌’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం..’ పాటతో నోరా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత ‘ఊపిరి’లో ‘నాట్య మయూరి’గా కుర్రకారును ఉర్రూతలూగించింది. 

ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌లో ఆడిపాడింది. ‘బాహుబలి’, ‘కిక్‌ 2’, ‘షేర్‌’, ‘లోఫర్‌’, ‘ఊపిరి’ తదితర చిత్రాల్లో తన డ్యాన్స్‌, గ్లామర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘100%’, ‘మడగావ్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘డ్యాన్సింగ్‌ డాడ్‌’, ‘మట్కా’ చిత్రాలతో బిజీగా ఉంది. 

నోరా ఫ్యాషన్‌ బాలీవుడ్‌లో ఓ ట్రేడ్‌ మార్క్‌. పింక్‌ విల్లా స్టైల్‌ ఐకాన్‌ అవార్డ్స్‌లో ఫ్యాషన్‌ ట్రయల్‌ బ్లేజర్‌ కేటగిరీలో టైటిల్‌ కూడా గెలుచుకుంది.

‘డ్యాన్స్ ప్లస్‌’, ‘ఇండియా బెస్ట్‌ డ్యాన్సర్‌’, ‘డ్యాన్స్‌ దివానే 3’, ‘జలక్‌ దిక్‌ లాజా’, ‘హిప్‌ హాప్‌ ఇండియా’లాంటి డ్యాన్స్‌ షోలకు జడ్జిగా వ్యవహరించింది. 

పలు పాప్‌ సాంగ్స్‌, వీడియోల్లోనూ ఆడిపాడింది. ‘బేబి మర్‌వాకే మానేగీ’, ‘అచ్చా సిలా దియా’, ‘డ్యాన్స్‌ మేరీ రాణి’, ‘నాచ్‌ మేరీ రాణి’, ‘బాడీ’ తదితర వీడియో పాటలు బాగా పాపుర్‌ అయ్యాయి.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home