ప్రియాంక చోప్రా మనసులో మాట!

అనతి కాలంలోనే ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి.. ప్రియాంక చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Image:instagram/priyankachopra

తన రంగు, శరీరాకృతిపై అనేక విధాలుగా కామెంట్లు చేస్తూ విమర్శించేవారని ప్రియాంక తెలిపింది.

Image:instagram/priyankachopra

‘కెరీర్‌ ప్రారంభంలో బ్లాక్‌ క్యాట్‌, డస్కీ అని విమర్శించేవారు. నా కంటే మంచి రంగున్న కథానాయికల కంటే నేను గొప్ప నటినే.. అనే భావనతో ముందుకెళ్లిపోయాను. అవి పట్టించుకుంటే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదేమో’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక.

Image:instagram/priyankachopra

తాజాగా అమెరికా స్పై వెబ్‌ ‘సిటాడెల్‌’లో నటించింది పీసీ. తన పాత్రకు కథానాయకుడితో సమానంగా పారితోషికం తీసుకున్నట్లు తెలిపింది. గతంలో హీరోలకు ఇచ్చే పారితోషికంలో పది శాతం కూడా తనకు దక్కేది కాదని వెల్లడించింది.

Image:instagram/priyankachopra

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక ఫెమినిస్ట్ భావజాలంతో వివిధ అంశాల మీద స్పందిస్తూ ఉంటుంది. ‘పితృస్వామ్య వ్యవస్థ కొనసాగినంత కాలం మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారని..’ పలు సందర్భాల్లో పేర్కొంది.

Image:instagram/priyankachopra

This browser does not support the video element.

ఈ బోల్డ్‌ బ్యూటీ.. 1982లో జులై 18న ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌లో జన్మించింది. తండ్రి సైన్యంలో డాక్టర్‌ కావటంతో తరచూ ఊళ్లు మారుతూ ఉండేవాళ్లు. దీంతో ఈమె వివిధ ప్రాంతాల్లో చదువుకోవాల్సి వచ్చింది. 

Image:instagram/priyankachopra

ఆ తర్వాత నటన మీద ఆసక్తితో సినీరంగంలోకి వచ్చింది. తొలుత ఈ బ్యూటీ 2002లో విజయ్‌ సరసన ‘తమిజాన్‌’తో సినీరంగంలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఈమె ఓ పాటను కూడా పాడింది. 

Image:instagram/priyankachopra

బాలీవుడ్‌లో పీసీ మొదటి చిత్రం... ‘ది హీరో: లవ్‌ స్టోరీ ఆఫ్‌ ఎ స్పై’లో తన నటనకు మంచి గుర్తింపు లభించింది. దీంతో ఆమెకు సినిమావకాశాలు క్యూ కట్టాయి. 

Image:instagram/priyankachopra

This browser does not support the video element.

మోడలింగ్‌తో తన కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2000లో ‘ప్రపంచ సుందరి’ కిరీటాన్ని దక్కించుకుంది. ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటం దక్కించుకున్న ఐదో భారతీయురాలుగా ప్రియాంకా నిలిచింది.  

Image:instagram/priyankachopra

ఇప్పటి వరకూ ఈ గ్లామర్ నటి.. 60 పైగా సినిమాలు చేసింది. తన నటనకు గానూ 5 ఫిలింఫేర్‌ అవార్డులు, ఒక జాతీయ అవార్డు పొందింది. ఈ సుందరిని భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ తో సత్కరించింది. 

Image:instagram/priyankachopra

కథానాయికగా మాత్రమే కాదు.. పలు సినిమాల్లో ప్రత్యేక గీతంలో కూడా మెరిసింది. నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా కూడా పేరు సంపాదించుకుంది. 

Image:instagram/priyankachopra

తను సినీరంగంలోకి అడుగుపెట్టినప్పటి ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ పోస్టు చూసి నెటిజన్లు తన జర్నీని ప్రశంసిస్తున్నారు.

2018లో అమెరికన్‌ నటుడు, గాయకుడు.. నిక్‌ జోనస్‌ను ప్రియాంకా ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన పేరును అధికారికంగా ప్రియాంకా చోప్రా జోనస్‌గా మార్చుకుంది. వీళ్లిద్దరూ సరోగసీ పద్ధతిలో ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు. 

Image:instagram/priyankachopra

This browser does not support the video element.

ఈమెకు సేవాభావం కూడా ఎక్కువే.. 15 ఏళ్ల నుంచి యూనిసెఫ్‌తో కలిసి పని చేస్తోంది. ప్రకృతి విపత్తులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు చేయూతనందిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా భారత్‌తో పాటు జోర్డాన్‌, బంగ్లాదేశ్‌, ఇథియోపియా, జింబాబ్వే దేశాల్లో పర్యటించింది. 

Image:instagram/priyankachopra

తీరా ఈవెంట్‌లో సెలబ్రిటీల సందడి

ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే..

బ్రేక్‌ వస్తే ఐలాండ్‌.. ఛాన్స్‌ వస్తే రాజమౌళి మూవీ!

Eenadu.net Home