ఓటీటీలో అందాల ‘కందిరీగ’

వెండితెరపై పెద్దగా రాణించలేకపోయిన కొంతమంది హీరోయిన్లు.. ఓటీటీ వెబ్‌సిరీస్‌లతో అదరగొడుతున్నారు. అలాంటి వారిలో అక్షా పార్దసాని ఒకరు. 

image:instagram/akshapardasany

తాజాగా ఈ భామ.. థ్రిల్లింగ్‌, మిస్టీరియస్‌ కథగా తెరకెక్కిన ‘ఖాఠ్‌మాండూ కనెక్షన్‌’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. 

image:instagram/akshapardasany

ఈ వెబ్‌ సిరీస్‌ డిసెంబర్‌ 23న ఓటీటీలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  

image:instagram/akshapardasany

అక్ష.. 1991లో నవంబర్‌ 08న ముంబయిలో జన్మించింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్‌ ప్రారంభించింది. 75కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించింది. 

image:instagram/akshapardasany

నటన మీద ఆసక్తితో 2004లో ‘ముసఫిర్‌’తో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తను పదో తరగతి చదువుతున్న సమయంలో ‘గోల్‌’లో ప్రధాన పాత్ర పోషించింది. 

image:instagram/akshapardasany

తెలుగులో ‘యువత’, ‘రైడ్‌’, ‘కందిరీగ’, ‘బెంగాల్‌ టైగర్‌’ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పటివరకు అక్ష.. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మొత్తం 16కి పైగా సినిమాలు చేసింది. 

image:instagram/akshapardasany

‘బ్యాంగిల్స్‌’లో ప్రత్యేక పాటలో అలరించింది. ‘జంతారా - సబ్కా నంబర్‌ ఆయేగా’వెబ్‌ సిరీస్‌లోనూ పోలీసు అధికారిగా నటించింది. 

image:instagram/akshapardasany

ఈ సుందరికి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా కొండ ప్రాంతాలు, పచ్చదనం అలుముకున్న ప్రదేశాలకు వెళ్తూ ఉంటుంది. ప్రకృతి ప్రేమికురాలీమె!

image:instagram/akshapardasany

This browser does not support the video element.

ఈ భామకు పానీపూరి అంటే చాలా ఇష్టం! షూటింగ్‌ మధ్యలో కూడా తింటుందట!

image:instagram/akshapardasany

ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే..

సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

అలిలా కోటలో ‘రాయల్‌’గా అదితి- సిద్ధార్థ్‌

Eenadu.net Home