స్టైలిష్‌ అర్హ...

అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్హకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఎక్కువే. అర్హ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర విషయాలు..

This browser does not support the video element.

‘అల వైకుంఠపురం’లో ‘రాములో రాముల..’ పాటకు హీరోయిన్‌ పూజా హెగ్డేతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అంతేకాకుండా దానికి దోశ స్టెప్‌ అని కూడా పేరు పెట్టేసింది. 

కుమార్తె ముద్దు ముద్దు మాటలు, అల్లరి వీడియోలను అర్జున్‌ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. అర్హ ఇన్‌స్టా ఫాలోవర్స్‌ లక్షకుపై మాటే. 

సమంత ‘శాకుంతలం’లో భరతుడిగా అర్హ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొంత సమయమే కనిపించినా తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

This browser does not support the video element.

‘పుష్ప’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘తగ్గేదేలే..’ డైలాగ్‌తో అందరినీ ఆకట్టుకుంది.

This browser does not support the video element.

ఓ సారి అర్హ కోసం అభిమానులు ఇంటి వద్దకు రాగా.. వారిని పలకరించేందుకు గేట్‌ దగ్గరికి వచ్చి కళ్లతో క్రేజీ లుక్‌ ఇచ్చింది. కంటి రెప్పలు పైకి లేపి వారిని భయపెట్టింది.

This browser does not support the video element.

‘‘శాకుంతలం’లో అర్హ అద్భుతంగా నటించింది. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. నటనలో శిక్షణ అవసరం లేదు. పుట్టుకతోనే సూపర్‌ స్టార్‌’ అని సమంత ప్రశంసలు కురిపించింది.

This browser does not support the video element.

నాలుగేళ్లకే నోబుల్‌ బుక్‌ అవార్డును అందుకుంది. ప్రపంచంలోనే పిన్న వయస్కురాలైన చెస్‌ ట్రైనర్‌గా ‘వరల్డ్‌ యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్‌’ అవార్డును గెలుచుకుంది. 

స్టార్‌ కిడ్‌గా ఫేమస్‌ అయిన అర్హ వినాయక చవితికి సర్‌ ప్రైజ్ ఇచ్చింది. మట్టి వినాయకుడిని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

This browser does not support the video element.

డ్యాన్స్‌, రీల్స్‌ చేయడం, నాన్న, అన్న అయాన్‌తో కలిసి ఆడుకునే వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. 

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

సిల్క్‌స్మితగా చంద్రిక

Eenadu.net Home