‘లైగర్’ లేడీ బర్త్‌డే..!
This browser does not support the video element.
విజయ్ దేవరకొండతో ‘లైగర్’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది అనన్యా పాండే. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. అక్జోబరు 30న ఈ బ్యూటీ పుట్టినరోజు. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు.
ప్రస్తుతం మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంది. ‘ఖో గయే హమ్ కహాన్’, ‘కంట్రోల్’, ‘శంకర’లతో అనన్య ప్రస్తుతం బిజీ బిజీ.
ఇటీవల విడుదైన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లోనూ ఓ పాటలో కనిపించింది. ఆయుష్మాన్ ఖురానా ‘డ్రీమ్ గర్ల్ 2’లో తన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
ఈ బాలీవుడ్ బ్యూటీ 1998లో ముంబయిలో పుట్టింది. లాస్ ఏంజిల్స్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. తండ్రి చంకీ పాండే ప్రముఖ బాలీవుడ్ నటుడు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకుగానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డూ లభించింది.
షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అనన్యా పాండే బాల్య స్నేహితులు. పార్టీలు ఫంక్షన్లలో కలిసి హడావుడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.
‘సెలబ్రిటీల పిల్లలు అయితే తేలికగా ఆఫర్లు వస్తాయంటారు కొందరు. కానీ నేను సినిమాల్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. అప్పుడే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో అవకాశం వచ్చింది’ అంటుంది అనన్యా.
‘హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాలు కొన్ని ప్రాంతీయ రాష్ట్రాల్లోనే ఆగిపోతాయి. కానీ తెలుగు సినిమాలు అలా కాదు.. ప్రాంతాలతో పని లేకుండా పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ‘పుష్ప’, ‘అర్జున్ రెడ్డి’, ‘రంగస్థలం’ సినిమాల్లో నాయికలు మంచి గుర్తింపూ తెచ్చుకున్నారు’ - అనన్య
హ్యారీ పోటర్ పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. ‘చాక్లెట్లు బాగా తింటాను. హృతిక్ రోషన్ అంటే చిన్నప్పటి నుంచే క్రష్. వరుణ్ ధావన్ సరసన నటించాలని ఉంది’ అంటుంది ఈ బర్త్‌డే బ్యూటీ.
యాక్టింగ్‌లో ఆలియా భట్, కరీనా కపూర్‌లను ఆదర్శంగా తీసుకుంటాను. వారి నటనాతీరు అంటే ఎంతో ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అనన్య ఇన్‌స్టాఖాతా ఫాలోవర్స్ 24. 6 మిలియన్లు.