అప్పుడే పేరు మార్చుకున్నా..!

ఆమె అందం, అభినయం చూస్తే ‘సూపర్’ అనాల్సిందే.. కట్టు, బొట్టు తో ‘ జేజమ్మ’ లా కనువిందు చేస్తుంది. ఈ ‘దేవసేన’.. వయసు పెరుగుతున్నా.. అందంలో తగ్గేదేలే అంటుంది అనుష్క. ఈమె పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర విషయాలు..

స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెబుతూ..యోగా టీచర్‌గా ఎంతో మందికి శిక్షణ కూడా ఇచ్చింది స్వీటీ . ‘సూపర్’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క శెట్టి తన పేరును స్వీటీ నుంచి అనుష్కగా ఎందుకు మార్చుకుందో తెలుసా..! 

‘సూపర్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు పూరి జగన్నాథ్‌ ఆమె పేరును స్వీటి నుంచి అనుష్కగా మార్చారు. 

This browser does not support the video element.

ప్రభాస్‌ అనుష్క 15 ఏళ్లుగా మంచి స్నేహితులు. ‘నాకు ఉన్న ‘3 am’ స్నేహితుల్లో ప్రభాస్‌ ఒకడు. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోవట్లేదు. తెరపై మా జంట హిట్టే..! అలా అని పెళ్లి చేసుకోవాలని ఏం లేదుగా. ఒక వేళ రిలేషన్‌లో ఉన్నా మాకు దాచాల్సిన పని లేదు’ అని ప్రభాస్‌ గురించి చెబుతుందీ భామ. 

‘కాంతారా’ సినిమా తర్వాత ‘ భూతకోల’ ప్రదర్శన ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. అయితే మంగళూరులో నిర్వహించిన ఈ ప్రదర్శనకు అనుష్క తన కుటుంబంతో కలిసి వెళ్లింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు అనుష్కది కర్ణాటకలోని బెల్లిపడి గ్రామం. 

‘‘ది ఆల్కెమిస్ట్’ ఫెవరెట్ బుక్. కలల్ని నిజం చేసుకునేందుకు ప్రతి సారి ఈ పుస్తకం నాకు ప్రేరణగా నిలిచింది. ఏదైనా సాధించాలనుకుంటే అడుగడుగునా అవరోధాలు ఎదురౌతూనే ఉంటాయి. కష్టపడి పనిచేస్తే కచ్చితంగా సాధించగలం’ - అనుష్క

సినిమాలో రోల్‌ కోసం ఎంత కష్టమైన పనినైనా తేలికగా చేస్తుంది. ఓ సీన్ సహజంగా రాకపోతే దాని కోసం ఎన్ని టేక్‌లైనా ఫర్వాలేదు అంటుంది స్వీటీ. ‘రుద్రమదేవి’ కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము వంటివీ నేర్చుకుంది. 

‘సైజ్‌ జీరో’ కోసం బొద్దుగా కనిపించేందుకు కృత్రిమంగా ఏర్పాట్లు చేశారట. అది సహజంగా లేదు. శరీరానికి నప్పట్లేదని బరువు పెరిగేందుకు సిద్ధమైంది. అలా ఈ సినిమా కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది. 

This browser does not support the video element.

ఇన్నేళ్ల కెరీర్‌లో హిందీ తప్ప మిగతా దక్షిణాది భాషల్లో దాదాపు 47 చిత్రాలు చేసింది. ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’ 48వ చిత్రం. దీనితో అనుష్క తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అభిమానుల్లో తనకున్న క్రేజ్‌ని మళ్లీ నిరూపించుకుంది. 

పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు రెండు దశబ్దాలు పూర్తవనుంది. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించే ఈ భామ ‘కథనార్‌’తో మొదటిసారిగా మలయాళంలో అడుగుపెడుతోంది. ‘అరుంధతి’ లాగానే ఈ చిత్రంలో కూడా తన పాత్ర శక్తిమంతమైనది. ఎస్‌. జె సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. 

‘ఇంట్లో అప్పుడప్పుడూ అమ్మకు వంటలో సాయం చేస్తాను. పప్పు, నెయ్యి ఉంటే భోజనం సంతృప్తికరం అవుతుంది. ఫాస్ట్‌ఫుడ్‌లో పాస్తా అంటే చాలా ఇష్టం’ అంటుంది అనుష్క.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home