అవతార్ 2.. ఆసక్తికర విషయాలు!
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్’ 2009లో విడుదల కాగా.. ఈ చిత్రం సీక్వెల్ రావడానికి 13 ఏళ్లు పట్టింది.
Image:Social Media
‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’పేరుతో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Image:Social Media
ఈ చిత్ర నిర్మాణానికి 250 మిలియన్ డాలర్లు ఖర్చయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ. 2,067కోట్లు.
Image:Social Media
సినిమా విడుదలకు ముందే ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.
Image: Social Media
ఈ సినిమా చూసిన క్రిటిక్స్ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘ఉత్తమ మోషన్ పిక్చర్-డ్రామా’, ‘ఉత్తమ దర్శకుడు’ విభాగాలకు నామినేట్ చేశారు.
Image:Social Media
చైనాలో చాలా వరకు హాలీవుడ్ సినిమాలు విడుదల కావు. కానీ, తాజాగా ‘అవతార్ 2’ చైనా వ్యాప్తంగా విడుదలైంది. ప్రి బుకింగ్స్‌తో భారీ వసూళ్లు రాబట్టింది.
Image:Social Media
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 160కిపైగా భాషల్లో విడుదలైంది. భారత్‌లో ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Image:Social Media
‘టైటానిక్’ హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ‘టైటానిక్’కు దర్శకత్వం వహించింది కామెరూనే. 25 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి పనిచేశారు.
Image:Social Media
అవతార్ 2 కోసం కామెరూన్‌కు తన ఊహల్ని కళ్లకుకట్టే విధంగా చూపించే కొత్త కెమెరా అవసరమైంది. అందుకే, సోనీ కంపెనీతో కలిసి సరికొత్త కెమెరాను అభివృద్ధి చేశాడు.
Image:Social Media
ఈ చిత్రం ఎక్కువగా నీళ్లలో ఉండటం వల్ల నటీనటులకు నీళ్లలో మునిగి ఎక్కువ సేపు ఊపిరి బిగపట్టి ఉండేలా శిక్షణ ఇప్పించారట దర్శకుడు కామెరూన్.
Image:Social Media
ఈ చిత్రం తర్వాత మరో మూడు సీక్వెల్స్ రానున్నాయి. వాటి టైటిల్స్ ‘అవతార్: ది సీడ్ బేరియర్, అవతార్: టుకున్ రైడర్, అవతార్:ది క్వెస్ట్ ఫర్‌ఇవా’ అని ప్రచారం జరుగుతోంది.
Image:Social Media