ఓటీటీలో వచ్చేస్తోంది ‘బేబి’...

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. జులై 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ముచ్చట్లు మీ కోసం. 

థియేటర్లలో లాంగ్‌ రన్‌ తర్వాత ఈ నెల 25 నుంచి ఆహా ఓటీటీలో ‘బేబి’ అందుబాటులోకి రానుంది. 

ఈ సినిమా భారీ వసూళ్లను అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 91 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు తాజాగా చిత్ర బృందం స్వయంగా వెల్లడించింది. 

ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. ఇద్దరు హీరోలతో హీరోయిన్‌ ప్రేమ, ఆ తర్వాత పరిస్థితులు ప్రేక్షకుల గుండెల్ని మెలితిప్పేశాయి. 

ఓల్డ్‌సిటీలో పుట్టి పెరిగిన వైష్ణవి చైతన్య యూట్యూబర్‌గా సోషల్‌మీడియాలో ఫేమస్‌. ఇప్పుడు ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, యువ ప్రేక్షకులకు దగ్గరైంది.

This browser does not support the video element.

‘బేబి’లోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా..’ పాట విడుదలైన ఒక్క రోజులోనే దాదాపు 50 మిలియన్ల వ్యూస్‌ని సంపాదించుకుంది. ఇంకా ఆ పాటను వింటూనే ఉన్నారు.

సినిమాలో గణేష్‌ నిమజ్జనం సందర్భంగా వైష్ణవి చేసిన మాస్‌ డ్యాన్స్‌ సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయింది. ‘దసరా’లో కీర్తి సురేష్‌ డ్యాన్స్‌కు పోటీగా ఉందని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

‘నటిగా నా కెరీర్‌ని 2015లో మొదలుపెట్టా. నటిని అయ్యే క్రమంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నా. మా నాన్న బండి మీదే చాలా సినిమాల ఆడిషన్స్‌కి వెళ్లా’ అని వైష్ణవి గుర్తు చేసుకుంది.

 నేనొక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ని అని, టిక్‌టాక్‌ వీడియోలు చేసుకునేదాన్ని అని ఎంతో మంది విమర్శించారు. ‘బేబి’ చిత్రంలో లీడ్‌ రోల్‌ నాకు ఇవ్వటం గురించి కూడా చాలా మంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది. 

ఇప్పుడు ‘బేబి’గా మారాక స్టార్‌ హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్‌ లాంటి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. స్టేజీ మీదనే వైష్ణవి నటనను ప్రశంసలతో ముంచెత్తారు.

(photos: instagram/vaishnavi_chaitanya_)

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home