బాలయ్య అలా పిలవొద్దన్నారు..
‘నేను పక్కా లోకల్..’ అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన కాజల్..ప్రస్తుతం బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’లో నటించింది. ఈ సినిమా అక్టోబరు 19న విడుదల కానుంది.
This browser does not support the video element.
బాలకృష్ణకు ఇది 108వ సినిమా కాగా మొదటి సారిగా కాజల్, బాలయ్య తెరను పంచుకున్నారు. ఇందులో కాజల్ ‘కాత్యాయని’గా కనిపించనుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
This browser does not support the video element.
కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’లోనూ కాజల్ నటిస్తోంది. ఈ మూవీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ ‘సత్యభామ’లోనూ ఈమే నాయిక. ఇందులో పోలీస్‌గా కనిపించనుంది.
వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూని 2020లో వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ తన జోరు మొదలు పెట్టింది.
డెలివరీ తర్వాత నాలుగు నెలలకే తిరిగి వ్యాయామం, డైట్‌పై దృష్టి సారించింది. అందులో భాగంగా గుర్రపు స్వారీ చేస్తూ ‘ఇంతకు ముందులా ఏది లేదు. ఇప్పుడే అన్నీ మొదలు పెట్టినట్లుగా అనిపిస్తుంది’ అని ట్యాగ్ చేసి ఓ వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అది వైరల్ అయ్యింది.
కాజల్ తనయుడు నీల్ కిచ్లూతో దిగిన ఫొటోలు, అల్లరి వీడియోలను ఇన్‌స్టాలో ఎక్కువగా పంచుకుంటుంది. తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్స్ 26.5 మిలియన్ల మంది.
‘కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ.. కెరీర్‌లో ముందడుగేస్తాను. తెలుగు చిత్ర పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టం. నిరంతరం ఓ విద్యార్థిలా నేర్చుకునేందుకు అవకాశాలు వస్తోన్నాయి’ అంటుంది కాజల్.
‘సినిమాలతో పాటు వ్యక్తిగతంగా ఎదగడం చాలా ముఖ్యం. నా మొదటి ప్రాధాన్యం సినిమాలే. ఛాలెంజ్‌గా తీసుకుంటే ఏ పనైనా పూర్తి చేయొచ్చు. మళ్లీ ఈ లక్షణాలన్నీ శ్రీలీలలో చూశాను’ అని చెబుతోంది.
‘భగవంత్ కేసరి’ షూటింగ్ సమయంలో బాలకృష్ణ అందరితో సరదాగా ఉండేవారు. ఆయన్ను ‘బాలయ్య సార్’ అని పిలిస్తే ‘బాల్స్’ అని పిలవమన్నారని కాజల్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పంచుకుంది. ఈ విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది.