‘భీమా’తో ముంబయి బ్యూటీ..

హీరో గోపీచంద్‌ నటిస్తోన్న తాజా చిత్రం.. ‘భీమా’. ఇందులో ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నారు. వారిలో ఒకరు.. ప్రియా భవానీ శంకర్‌ కాగా.. మరొకరు మాళవిక శర్మ.

(photos:instagram/malvikasharmaofficial)

తాజాగా ఈ సినిమాలో మాళవికను ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఎంపిక చేసుకున్నట్లు ‘భీమా’ చిత్రబృందం ప్రకటించింది. 

రవితేజ ‘నేల టిక్కెట్టు’తో 2018లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘రెడ్‌’, తమిళ్‌లో ‘కాఫీ విత్‌ కాదల్‌’లో నటించింది. 

అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ప్రేక్షకులకు దూరమైంది. ఇప్పుడు ‘భీమా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

ముంబయిలో పుట్టిపెరిగిన మాళవిక.. అక్కడే చదువుకుంది. రిజ్వి లా కాలేజీలో ఎల్.ఎల్‌.బి పూర్తి చేసింది.

కాలేజీలో చదువుకునేటప్పుడే మోడలింగ్‌తో తన కెరియర్‌ని మొదలుపెట్టిందీ భామ. ‘నేల టిక్కెట్టు’తో తెరంగేట్రం చేసింది.

పలు బ్రాండ్స్‌ ప్రచారచిత్రాల్లో నటించిన మాళవికకు.. చిన్నప్పట్నుంచే కథక్‌ డ్యాన్స్‌ అంటే కూడా చాలా ఇష్టమట. ఇంకా కథక్‌లో శిక్షణ తీసుకుంటోందట. 

ఈ మధ్య డియోఘర్‌లోని ఓ పాఠశాలని సందర్శించి అక్కడ ఉన్న పేద విద్యార్థులకు చెప్పులు తొడిగి పెద్ద మనసు చాటుకుంది మాళవిక. ఆ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ భామకి జంతువుల పెంపకం, ప్రకృతిలో గడపడం అంటే చాలా ఇష్టమట. అలాగే సంప్రదాయ దుస్తుల్లో పండగలు సెలబ్రేట్‌ చేసుకోవాలంటే మాళవిక ముందుంటుంది. 

ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతూ, డ్యాన్స్‌ చేస్తూ సమయాన్ని గడిపేస్తుందట. తరచూ దేవాలయాలు సందర్శిస్తుంటుంది. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home