మాల్దీవుల్లో బుట్టబొమ్మ బర్త్‌డే
ఈ రోజు టాలీవుడ్ ‘జిగేల్ రాణి’ అలియాస్ ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే పుట్టినరోజు. మరి ఆమె గురించి ఆసక్తికర వివరాలు చూద్దామా!
This browser does not support the video element.
పుట్టిన రోజు సందర్భంగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్‌లో తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ ‘కరెంట్లీ అన్‌ఎవైలబల్’ అని క్యాప్షన్ పెట్టింది.
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, వెంకటేష్ మల్టీస్టారర్ ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’లో పూజా చివరిసారిగా నటించింది. ఈ సినిమా పరాజయంతో ఆమె కొద్ది రోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకుంది.
మహేష్‌బాబు ‘గుంటూరు కారం’లో ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్‌గా ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల తన స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
పూజా చాలా మొండి. ఎంతో ఇష్టపడి భరత నాట్యం నేర్చుకుంటా అంటే... వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు. దీంతో తన తండ్రిని పట్టుబట్టి ఒప్పించి నేర్చుకుని కలను సాకారం చేసుకుంది.
ఈ బ్యూటీ హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మరాఠీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. టాలీవుడ్ ద్వారా తనకు తెలుగు కూడా నేర్చుకునే అవకాశమూ లభించిందని చెబుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ స్టైలిష్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇన్‌స్టా చూస్తే... కొత్త ట్రెండ్స్ చాలానే కనిపిస్తాయి.
బాలీవుడ్‌లో రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో షాహిద్ కపూర్‌తో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. అందులో పూజానే హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ యువతను కట్టిపడేస్తోంది. తన ఇన్‌స్టా ఫాలోవర్స్ 25 మిలియన్లమంది.
ఇంతకుముందు ఆమెను లక్ష్మీ పూజ అని పిలిచేవారట. ట్రెండీగా లేదని పెద్దయ్యాక పూజ అని షార్ట్ చేసుకుంది.
పూజా చాలా పెద్ద ఫూడీ. హైదరాబాదీ బిర్యాని, పిజ్జా లాంటివి తినే అవకాశం వస్తే... నన్ను ఆపడం చాలా కష్టం అని చెబుతుంటుంది.
రాహుల్ ద్రవిడ్‌తో పాటు టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్‌కి వీరాభిమానిని అని చెబుతుంది.