ఆస్ట్రేలియా బ్యూటీ.. చంద్రికా ఎంతో ప్రత్యేకం..!

ప్రత్యేక గీతాలతో పాపులారిటీ సంపాదించుకుంది.. చంద్రికా రవి. ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేసింది. 

image:Instagram/chandrikaravi

బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది చంద్రికా రవి.

image:Instagram/chandrikaravi

సినిమాకి తమన్‌ సంగీతం అందించారు. ఈ పాటలు ప్రస్తుతం యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

image:Instagram/chandrikaravi 

ఈమె ఆడిపాడిన ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాట ఎంతో పాపులర్‌ అయింది. విడుదలైన గంటల్లోనే 10 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. 

image:Instagram/chandrikaravi

నటసింహం బాలయ్య సరసన ప్రత్యేక గీతంలో ఆడిపాడిన చంద్రికకి ఈ పాటతో మంచి గుర్తింపు లభించింది. 

image:Instagram/chandrikaravi

పాట చిత్రీకరణ సమయంలో చంద్రిక నడుము బెణికిందట! అయినా నొప్పితోనే డాన్స్‌ చేసింది. ఈ విషయాన్ని సెట్‌లో ఎవరికీ చెప్పలేదని షూట్‌ పూర్తయ్యాక చెప్తే నొప్పితో కూడా బాగా డాన్స్‌ చేశావని మెచ్చుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

image:Instagram/chandrikaravi

ఈ భామ.. 1989 ఏప్రిల్‌ 5న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జన్మించింది. 

image:Instagram/chandrikaravi

చంద్రిక మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే డాన్స్‌ నేర్చుకోవటం మొదలు పెట్టింది. తన కెరీర్‌ను 16 ఏళ్లకే ప్రారంభించింది. భరతనాట్యం, కథక్‌, ఒడిస్సి నాట్యంలో కూడా శిక్షణ తీసుకుంది. 

image:Instagram/chandrikaravi

ఈ సుందరిది.. మర్డోక్‌ విశ్వవిద్యాలయం. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో ఉన్న ఈ వర్సిటీలో 'ఇంగ్లిష్ అండ్‌ ఫెర్మామింగ్‌’చదివింది. 2012లో నటన మీద ఆసక్తితో న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో డిప్లొమా పూర్తి చేసింది. 

image:Instagram/chandrikaravi

టెలివిజన్‌ రంగంలో మెరిసిన ఈ నటి.. మోడలింగ్‌ కూడా చేసింది.

image:Instagram/chandrikaravi

This browser does not support the video element.

భారతీయ మూలాలు ఉన్న ఈ నటికి తెలుగు సంప్రదాయాలంటే చాలా ఇష్టం. పండుగ రోజుల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటుంది.

image:Instagram/chandrikaravi

ఈమె మహిళల అభ్యుదయమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం యూఎన్‌ఐసీఈఎఫ్ సభ్యురాలిగా ఉంటూ.. ఎన్‌జీవోలు నడిపిస్తోంది.

image:Instagram/chandrikaravi

‘ఇరుత్తు అరయిల్ మురత్తు కుత్తు’తో 2018లో తమిళంలో సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో చంద్రిక దెయ్యం పాత్రలో నటించి.. మెప్పించింది. ఈ సినిమాను తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’గా రీమేక్‌ చేశారు. 

image:Instagram/chandrikaravi

This browser does not support the video element.

చంద్రిక ప్రస్తుతం తమిళం లో సినిమాలు చేస్తోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట! అమెరికాలో కూడా కొన్ని షోలు చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

image:Instagram/chandrikaravi

టాప్‌-10 స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లు.. అస్సలు మిస్సవ్వదు

సినిమాల కోసం ఏమైనా చేస్తా..!

శ్రీవల్లి సంగతులు.. చిత్రాల్లో

Eenadu.net Home