సాహసాల నాయిక.. దీపిక
ఈ మధ్య వరుస యాక్షన్ సినిమాలతో హోరెత్తిస్తున్నారు నాయికలు. ‘పఠాన్’, ‘జవాన్’లలో ఫైటింగ్ సీన్‌లతో అదరగొట్టిన దీపికా పదుకొణె మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘సింగం అగైన్’లో శక్తి పాత్రలో అలరించనుంది. ఇటీవల పోలీస్ దుస్తుల్లో ఉన్న తన రోల్ ఫస్ట్ లుక్ విడుదలైంది.
ఈ ఫొటోకి ‘అమ్మాయిలు మహా సాధ్వి సీతగానే కాదు.. అవసరమైతే శక్తికి ప్రతిరూపమైన దుర్గగానూ అవతారం ఎత్తగలరు. చెడ్డవారిని అణచివేసే శక్తిని మీకు పరిచయం చేస్తున్నా..’ అని ఈ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టి వ్యాఖ్య రాశారు.
ఈ ఫస్ట్‌లుక్ చూసిన పలువురు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ‘లేడీ సింగం’లా ఉన్నావంటూ.. దీపికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి’లోనూ ఈమే నాయిక. ఈ మూవీకి నాగ అశ్విన్ దర్శకుడు.
దీపికా, హృతిక్ రోషన్ జంటగా రానున్న మరో సినిమా ‘ఫైటర్’. దీపిక ఇందులో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా, పలు యాక్షన్ సీన్లతో అలరించనుంది.
‘పద్మావతి’లో ‘ఘూమర్’ పాట కోసం దీపిక ధరించిన లెహంగా బరువు దాదాపు 30 కిలోల పైమాటే. 30 లక్షలు పెట్టి ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. సినిమాలో పాత్రల కోసం ఎక్కువ ఖరీదు గల దుస్తులు ధరించే టాప్ టెన్ బాలీవుడ్ నటీనటుల్లో ఈ బ్యూటీ కూడా ఉంది.
‘ఎలాంటి ఆహారానికైనా అస్సలు నో చెప్పను. ఏ మోతాదులో ఆహారం తీసుకుంటే అంతే హెవీగా వర్కవుట్స్ చేస్తాను. ఏం తిన్నా అందులో ఎన్ని పోషకాలున్నాయి. ఎన్ని కేలొరీలున్నాయని మాత్రం చూస్తాను’ అంటుంది దీపిక.
This browser does not support the video element.
తన భర్త రణ్‌బీర్ సింగ్‌తో చేసే డ్యాన్స్, అల్లరి వీడియోలు ఇన్‌స్టాలో ఎక్కువగా పంచుకుంటుంది. దీపిక ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్స్ 76. 5 మిలియన్ల మంది.
‘బెంగళూరు అంటే ఇష్టం. ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ దొరికే ఆహారం చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, సాంబార్ నాకు బాగా నచ్చుతాయి’ అని చెబుతుంది దీపిక.