‘వైరల్‌ విశాలాక్షి’

‘మామా మశ్చీంద్ర’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఈ నెల 6న సినిమా విడుదలకానున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..

ఈషాకు చిన్నప్పటి నుంచీ నటికావాలనేది లక్ష్యం. అందుకే ఎంబీఏ పూర్తయిన తర్వాత మోడలింగ్‌ వైపు వెళ్లింది. మధ్యలో న్యూస్‌ రీడర్‌గా, రిపోర్టర్‌గానూ ప్రయత్నించింది.

మోడలింగ్‌ చేస్తున్న సమయంలో ఆమె కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వాటిని చూసి దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ‘అంతకు ముందు ఆ తరవాత’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. 

అంతకు ముందే ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో చిన్న పాత్ర పోషించింది.

ఈ బ్యూటీకి విహార యాత్రలంటే మహా ఇష్టం. స్విట్జర్లాండ్‌, పారిస్‌ ఇష్టమైన ప్రదేశాలు.

రాజ్మాతో చేసిన పదార్థాలు, పిజ్జా కనిపిస్తే చాలు తినేస్తుంటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఫేవరెట్‌ కలర్స్‌: నలుపు, నీలం.

తెలుగు అమ్మాయిలకు అవకాశంరావట్లేదని కొందరు అంటుంటారని, తన విషయంలో అలా ఎప్పుడూ జరగలేదని చెప్పే ఈషా తమిళం, మలయాళం చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. రెండేళ్ల వ్యవధిలోనే ఆమె నాలుగు వెబ్‌సిరీస్‌ల్లో కనిపించడం విశేషం. 

మనసుకు నచ్చే కథలు/పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది. అందుకే 11 ఏళ్ల ప్రయాణంలో 18 సినిమాల్లో (అతిథి పాత్రలుసహా) ఆమె సందడి చేసింది.

సుధీర్‌ బాబు హీరోగా రూపొందిన ‘మామా మశ్చీంద్ర’లో వైరల్‌ విశాలాక్షిగా నటించింది. టిక్‌టాక్‌ వీడియోలు చేసే అమ్మాయిగా సందడి చేయనుంది.

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

సిల్క్‌స్మితగా చంద్రిక

Eenadu.net Home