నటనలోనూ నిరూపించుకుంటా!
‘పృథ్వీరాజ్’తో మెరిసింది మానుషి చిల్లర్. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన ‘ఆపరేషన్ వాలంటైన్’లో నటిస్తోంది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా తెరకెక్కిస్తున్న చిత్రమిది. డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్‌లో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’లోనూ విక్కీ కౌషల్ సరసన మానుషి హీరోయిన్.
మిస్‌వరల్డ్ కిరీటాన్ని 2017లో సొంతం చేసుకున్న మానుషి అందం గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. తను ఇంత అందంగా ఉండేందుకు ఏయే ప్రొడక్స్ట్ వాడుతుందనే వార్తలూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి.
This browser does not support the video element.
‘పృథ్వీరాజ్’ నిరాశకు గురి చేసినప్పుడు మానుషి ఏమందంటే.. ‘సినిమా ఫలితం మన చేతిలో ఉండదు. కానీ దీనికోసం చాలా కష్టపడ్డాను. తెరమీద నన్ను చూసుకున్నప్పుడు దాని రిజల్ట్ గురించి మర్చిపోయాను.’
‘అందాల పోటీల్లో విన్నర్ కావొచ్చు.. అలాగని నటనకు పనికి రారు’.. అన్న వ్యాఖ్యలూ ఎదురొచ్చాయి. అందుకామె..‘నేను డాక్టర్‌ని. మిస్ ఇండియాని. యాక్టర్‌గానూ నిరూపించుకుంటా’ అని బదులిచ్చింది.
మాజీ మిస్ వరల్డ్‌కి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం. కూచిపూడిలో కొన్నేళ్లపాటు శిక్షణ తీసుకుంది.
అమెరికాకు చెందిన ప్రముఖ కాస్మెటిక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్.
విహారయాత్రలంటే ఇష్టం. బంగీ జంప్, ట్రెక్కింగ్, స్కూబా డైవింగ్.. తనకిష్టమైన యాక్టివిటీస్.