ఫుట్‌బాల్‌.. మీకివి తెలుసా!

ఫుట్‌బాల్‌ను అమెరికా, యూరప్‌ దేశాలు ఎక్కువగా ఆడతాయి. కానీ, ఈ ఆట క్రీస్తుపూర్వం 476లో చైనాలో మొదలైందని చరిత్రకారులు చెబుతున్నారు.

Image: RKC

ప్రపంచంలో అత్యధిక వీక్షకులు ఉన్న క్రీడ ఫుట్‌బాల్‌. ఫిఫా ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా, టీవీల్లో దాదాపు 200 కోట్లకు పైగా అభిమానులు వీక్షిస్తుంటారట.

Image: RKC

ఒక్క మ్యాచ్‌లో ఒక ఆటగాడు మైదానంలో సగటున 9.65కి.మీ పరుగు తీస్తాడట.

Image: RKC

ఫుట్‌బాల్‌ను ‘సాకర్‌’ అని కూడా అంటారన్న విషయం తెలిసిందే. కానీ, అలా కేవలం అమెరికన్లు, కెనడియన్లు మాత్రమే పిలుస్తారు.

Image: RKC

ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే 80శాతం ఫుట్‌బాల్స్‌ పాకిస్థాన్‌లోనే తయారవుతాయి. 

Image: RKC

టీవీలో తొలిసారిగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ప్రసారమైంది 1937లో. అది కూడా లండన్‌కు చెందిన ఆర్సెనల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టుకు సంబంధించిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌. 

Image: RKC

మొత్తం 30కిపైగా దేశాలు ఫిఫా ప్రపంచకప్‌లో పోటీ పడుతుంటాయి. కానీ, ఇప్పటి వరకు కప్‌ గెలిచింది కేవలం 8 దేశాలు మాత్రమే. అవి.. బ్రెజిల్‌(5సార్లు), జర్మనీ(4), ఇటలీ(4), అర్జెంటీనా(2), ఫ్రాన్స్‌(2), ఉరుగ్వే(2), ఇంగ్లాండ్‌, స్పెయిన్‌ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

Image: RKC 

ఫుట్‌బాల్‌ చుట్టుకొలత 28 అంగుళాలుంటుంది. గత 120 ఏళ్లుగా బాల్‌ సైజులో మార్పు లేదు.

Image: RKC

మ్యాచ్‌లో 1,2 గోల్స్‌ చేయడమే కష్టం.. అలాంటిది 1942లో ఫ్రాన్స్‌కు చెందిన ఆటగాడు స్టీఫెన్‌ స్టానిస్‌ ఓ మ్యాచ్‌లో ఏకంగా 16 గోల్స్‌ సాధించాడు. 

Image: RKC

ప్రపంచంలో అతిపెద్ద ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ 1999లో బ్యాంకాక్‌లో జరిగింది. ఈ టోర్నీలో 5,098 జట్లు పోటీ పడ్డాయి. 53వేల మంది ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు పాల్గొన్నారు. 

Image: RKC

చంద్రుడిపై తొలిసారి కాలుపెట్టిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపైకి ఫుట్‌బాల్‌ను తీసుకెళ్లాలని భావించారట. కానీ, నాసా అందుకు ఒప్పుకోలేదట. ఇది ఎంత వరకు వాస్తవమనే దానిపై స్పష్టత లేదు. 

Image: RKC

రోహిత్‌ @ 250.. 200 క్లబ్‌లో ఇంకెవరు?

ఐపీఎల్‌లో జట్ల అత్యల్ప స్కోర్స్‌ ఇవీ!

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలివీ!

Eenadu.net Home