ఫ్రాన్స్ గురించి మీకివి తెలుసా..?
ఫ్రాన్స్ అనగానే మనకి గుర్తొచ్చేవి రెండే రెండు.. ఒకటి ఈఫిల్ టవర్.. రెండు పెర్‌ఫ్యూమ్.. ఇవి కాకుండా ఆ దేశానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. అవేంటంటే..
image: unsplash
క్రైస్తవుల వివాహాల్లో వధువు వైట్ ఫ్రాక్ ధరించే సంప్రదాయం ఫ్రాన్స్‌లోనే పుట్టింది. తొలిసారి 1499లో కింగ్ 12వ లూయిస్ సతీమణి.. వారి వివాహంలో తెల్ల దుస్తులు ధరించింది. 1840లో క్వీన్ విక్టోరియా కూడా తన వివాహంలో వైట్‌ఫ్రాక్ ధరించడంతో బాగా ప్రాచుర్యం పొందింది.
image: unsplash
ఫ్రాన్స్ ప్రజలు ఏటా దాదాపు 30 వేల మెట్రిక్ టన్నుల నత్తలను తింటారంట. ఈ దేశంలో ప్రాణంతో ఉన్న నత్తలను ట్రైన్‌లో తీసుకెళ్లాలంటే వాటికీ టిక్కెట్ కొనాల్సిందే.
image: unsplash
ఏప్రిల్ ఫూల్స్ రోజున మనుషుల వీపుపై కాగితంతో చేసిన చేప బొమ్మలను అతికిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ ఫిష్ అని పిలుచుకుంటారు. ఇది అక్కడి వింత ఆచారం.
image:pixabay
ఫ్రాన్స్‌లో ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుందామనుకున్నాక అతడు/ ఆమె మరణించినా ఆ మృతదేహాన్ని వివాహం చేసుకోవచ్చు. దీనికో షరతుంది. చనిపోయిన వ్యక్తి కూడా తమని ప్రేమించారని నిరూపించాల్సి ఉంటుంది.
image:pixabay
ఫ్రాన్స్‌లో ఆహారాన్ని బయట పారేయడం చట్ట వ్యతిరేకం. అలా చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తారు. మిగిలిన ఆహారాన్ని ఛారిటీలకు లేదా దగ్గర్లోని ఫుడ్ బ్యాంకులకు అందజేయాలి.
image:pixabay
ఇప్పుడంటే మొబైల్‌లో కెమెరాతో తెగ ఫొటోలు దిగుతున్నాం. అసలు ఈ మొబైల్ కెమెరాను తయారు చేసిందెవరో తెలుసా? ఫ్రాన్స్‌కు చెందిన ఫిలిప్ ఖాన్. 1997లో దీన్ని తయారు చేసి అప్పుడే పుట్టిన తన కూతుర్ని మొదటి ఫొటో తీశాడట.
image: unsplash
ఫ్రాన్స్‌లో ప్రతిరోజు రెండు కొత్త వంటల పుస్తకాలు మార్కెట్లోకి వస్తాయి. ఆ దేశ వంటకాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ వంటకాల రెసిపీలు వీటిలో ఉంటాయి.
image:pxabay
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆర్ట్ మ్యూజియం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. దీని పేరు ‘లౌవ్రే’ ఇక్కడున్న ఒక్కో కళాఖండాన్ని చూసి అర్థం చేసుకునేందుకు ఒక మనిషికి 30 సెకన్లు పడుతుంది.
image: unsplash
ఫ్రాన్స్‌ను అతి తక్కువ సమయం పాలించిన రాజు 19వ లూయిస్. తండ్రి నుంచి వారసత్వంగా లూయిస్ రాజయ్యాడు. వ్యతిరేకత రావడంతో కేవలం 20 నిమిషాలకే సింహాసనం దిగాల్సి వచ్చింది.
image: unsplash
ఈ దేశంలోని రైల్వేస్టేషన్లో ప్యాసింజర్లు ముద్దులు పెట్టుకోవడానికి వీల్లేదు. ప్యాసింజర్లు రైలు ఎక్కకుండా ముద్దులు పెట్టుకుంటూ కాలం గడిపేయడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యేవట. టీసీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 1910లో ఈ రూల్ తీసుకొచ్చారు.
image: unsplash
సాహిత్యంలో మొదటి నోబెల్ బహుమతి ఫ్రాన్స్‌కే దక్కింది. ఆ దేశ రచయిత ప్రుదొమ్మె 1903లో ఈ బహుమతిని అందుకున్నారు.
image: unsplash