హన్సిక.. 50 చిత్రాల నాయిక

నటిగా సుదీర్ఘ ప్రస్థానమున్న అతి కొద్ది మందిలో హన్సిక ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. వివాహం తర్వాతా వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. 

ఈ ఏడాది ఇప్పటికే ‘పార్ట్‌నర్‌’తో అలరించగా ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’తో థ్రిల్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది ఆమెకు 52వ చిత్రం.

దర్శకుడు శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కించి ఈ సినిమా ఈ నెల 17న విడుదలకానుంది. మనిషి చర్మంతో చేసే వ్యాపారం నేపథ్యంలో రూపొందింది.

వివాహానంతరం (సోహైల్‌ కథూరియా) రూటు మార్చారు. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’సహా త్వరలో రానున్న ‘105 మినిట్స్‌’, ‘గార్డియన్‌’ తదితర చిత్రాలు ఆ కోవలోవే.

హన్సిక నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘మైత్రీ’ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తన పెళ్లి వేడుకనూ అదే ఓటీటీ చూడొచ్చు.

ముంబయిలో జన్మించారు. సుమారు 8 ఏళ్ల వయసులో ‘హవా’ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేశారు. 

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్‌గా మారారు.

తొలి సినిమాతోనే ప్రశంసలు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు దక్కించుకున్నారు. వరుస అవకాశాలు దక్కించుకున్నారు.

ఎన్టీఆర్‌ (కంత్రి), ప్రభాస్‌ (బిల్లా), రవితేజ (పవర్‌) వంటి స్టార్‌ల సరసన మెరిశారు. కన్నడ, మలయాళం, తమిళ పరిశ్రమల్లోనూ మంచి గుర్తింపు పొందారు.

హన్సిక నేరుగా తెలుగులో నటించిన చివరి చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ (2019). ఆ తర్వాత నుంచి డబ్బింగ్‌ మూవీస్‌తో పలకరిస్తున్నారు.

‘సౌత్‌ ఇండస్ట్రీ, నార్త్‌ ఇండస్ట్రీ అని నేను చిత్ర పరిశ్రమను వేరుగా చూడను’ అని ఓ సందర్భంలో చెప్పారు.

తాను కథానాయికగా ఎంట్రీ ఇచ్చే క్రమంలో హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు అప్పట్లో వచ్చిన వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపారు.

చై- శోభితల ప్రేమ ప్రయాణం: పెళ్లి పనులు స్టార్ట్‌

2024లో బెస్ట్‌ హారర్‌ ఫిల్మ్స్‌ ఇవే!

నారా రోహిత్‌ మనసు గెలిచిన శిరీష ..!

Eenadu.net Home