భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం సువిశాల దేశాన్ని ఏకం చేసింది. రెండేళ్ల తర్వాత నవంబరు 26న రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగాన్ని ఆమోదించారు.
image:RKC
ఈ రోజును గుర్తుంచుకోవడానికి 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.ఎం.సింఘ్వి న్యాయవాదుల దినోత్సవం చేయాలని తీర్మానించారు.
image:RKC
2015లో బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి రాజ్యాంగ దినోత్సవం పేరిట వేడుకలు జరుగుతున్నాయి.
image:RKC
ఈ రోజున అంబేడ్కర్ చరిత్ర, ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు తెలిపేలా ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.
image:RKC
ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రచించడానికి రెండేళ్ల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది.
image:RKC
తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో రాజ్యాంగసభను ఏర్పాటు చేశారు. దీనికి అంబేడ్కర్ సారథిగా వ్యవహరించారు. ఇందులో 299 మంది సభ్యులున్నారు. వీరిలో 15 మంది మహిళలున్నారు.
image:RKC
తొలి రాజ్యాంగ సభ సమావేశం 1946 డిసెంబరు 9న జరిగింది. ఇందులో ఏఏ దేశాల రాజ్యాంగాలను పరిశీలించాలో చర్చించారు. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. image:RKC
భారత రాజ్యాంగం సిద్ధం చేయడానికి రూ.కోటి మాత్రమే వినియోగించారు. రాజ్యాంగంలోని పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు ప్రజలకు అండగా ఉన్నాయి. వీటిని అనుసరించే చట్టాలు తయారవుతున్నాయి.
image:RKC
1977లో పౌరుల ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేస్తూ ఒక అధ్యాయాన్ని రాజ్యాంగంలో జత చేశారు. అప్పటి నుంచి ప్రజలు కూడా దానికి లోబడి ఉండాల్సిందే.
image:RKC