మనకూ ఉందొక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌!

కేన్స్‌, టొరంటో అంటూ పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్ గురించి వింటుంటాం. కానీ, మన దేశంలోనూ ఒక అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతుందని తెలుసా? అదే IFFI.

This browser does not support the video element.

అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) పేరుతో గోవాలో ఏటా వేడుక నిర్వహిస్తారు. నవంబర్‌ చివర్లో దీన్ని గోవా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జరుపుతారు.

తొలి ఐఎఫ్‌ఎఫ్‌ఐ వేడుక 1952న ముంబయిలో జరిగింది. ఆ తర్వాత దిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, తిరువనంతపురంలోనూ నిర్వహించారు. 2004 నుంచి గోవాలో మాత్రమే జరుగుతోంది. 

ఈ ఏడాది నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవా వేదికగా ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌ను నిర్వహించారు. 

ప్రపంచంలోని విభిన్న చిత్రసీమలకు చెందిన నటులు, దర్శకనిర్మాతలు దీనిలో పాల్గొంటారు. సినిమాకు చెందిన అనేక అంశాలపై సమావేశాలు, చర్చలు జరుగుతాయి. 

This browser does not support the video element.

ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ దేశాలకు చెందిన అత్యద్భుతమైన సినిమాలను ప్రదర్శిస్తారు. 

ఉత్తమ చిత్రానికి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు అందజేస్తారు. ఉత్తమ దర్శకుడు, నటి, నటుడిని సిల్వర్‌ పీకాక్‌తో సత్కరిస్తారు. నగదు బహుమతి ఉంటుంది. 

ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2023కి గానూ ఉత్తమ చిత్రంగా ఎంపికై గోల్డెన్‌ పీకాక్‌ అందుకున్న చిత్రం ‘ఎండ్‌లెస్‌ బార్డర్స్‌(పర్షియన్‌)’.

బల్గేరియాకు చెందిన డైరెక్టర్‌ స్టీఫెన్‌ కొమందరెవ్‌ ఉత్తమ డెరెక్టర్‌గా గోల్డెన్‌ పీకాక్‌ అందుకున్నారు. ‘బ్లాగాస్‌ లెస్సన్స్‌’ చిత్రానికి గానూ ఈ అవార్డు పొందారు. 

ఉత్తమ నటుడిగా పౌరియా రహిమీ సామ్‌(చిత్రం: ఎండ్‌లెస్‌ బార్డర్స్‌), ఉత్తమ నటిగా మెలనీ తెర్రీ(చిత్రం: పార్టీ ఆఫ్‌ ఫూల్స్‌) నిలిచా. అమెరికా నటుడు, నిర్మాత మైఖేల్‌ డగ్లస్‌ను ‘ది సత్యజిత్‌ రే జీవితసాఫల్య పురస్కారం’తో సత్కరించారు. 

 ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఉత్తమ వెబ్‌సిరీస్‌ కేటగిరిలో ‘పంచాయత్‌ 2’ విజేతగా నిలవగా.. స్పెషల్‌ జ్యూరీ అవార్డును ‘కాంతార’లో నటించి దర్శకత్వం వహించిన రిషభ్‌ శెట్టి అందుకున్నారు. 

సైకత శిల్పాలతో గోల్డ్‌ మెడల్‌

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

Eenadu.net Home