క్వీన్‌ ఆఫ్‌ కొత్త.. ఐశ్వర్య లక్ష్మి..

‘మట్టి కుస్తీ’లో నడుము బిగించి బాగా ఫేమస్‌ అయ్యింది.. ఐశ్వర్య లక్ష్మి. ఇటీవల వచ్చిన మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌..’లో కీలక పాత్ర పోషించింది. 

తాజాగా ఈ భామ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’తో ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకువస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి అభిలాష్‌ జోషియ్‌ దర్శకత్వం వహించారు.

ఈ మలయాళీ కుట్టి.. ‘నంజాన్‌డుకలుడే నట్టి ఒరిదవేల(2017)’తో మాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ మధ్యే టాలీవుడ్‌లోనూ పాపులారిటీ సంపాదించింది.

తొలి సినిమాతోనే ఆమె సహజ నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ పరిచయ నాయికగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది.

సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. మలయాళం, తమిళ్‌లో ఎక్కువగా నటించే ఐశ్వర్య.. తెలుగులో సత్యదేవ్‌ ‘గాడ్సే’తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘అమ్ము’తోనూ మెప్పించింది.

ఇటీవల మమ్ముట్టి నటించిన ‘క్రిస్టోఫర్‌’లో మెరిసింది. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రంలో లాయర్‌ అమీనా పాత్ర పోషించింది. 

నటిగా మెప్పిస్తూనే.. నిర్మాతగానూ మారింది. సాయి పల్లవి ‘గార్గి’ని నిర్మించిన నిర్మాతల్లో ఐశ్వర్య ఒకరు.

ఐశ్వర్యకు కుకింగ్‌ అంటే చాలా ఇష్టమట. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వంట చేసి ఇంట్లోవారికి వడ్డిస్తుందట.

షూటింగ్‌లో ఇతరత్రా పనుల్లో బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్టు చేస్తుంటుంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home